రామ్ లల్లా దర్శనానికి వెళ్లనున్న బీజేపీ ముఖ్యమంత్రులు

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈవేడుకకు పదివేల మందికి పైగా అతిథులను ఆహ్వానించారు. యూపీ సీఎం తప్ప ఇతర రాష్ట్రాల బీజేపీ సీఎంలు ఈ వేడుకలో పాల్గొనలేదు.

Update: 2024-01-24 17:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈవేడుకకు పదివేల మందికి పైగా అతిథులను ఆహ్వానించారు. ఈ వేడుకలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తప్ప ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరూ పాల్గొనలేదు. కాగా రానున్న రోజుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు అయోధ్య రాముడిద దర్శనం చేసుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. గర్భగుడిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవంత్, యూపీ సీఎం యోగి తప్ప ఇతర పార్టీ నాయకులెవరూ లేరు. ప్రస్తుతం సామాన్య భక్తులు అయోధ్య రాముడ్ని దర్శించుకుంటున్నారు. తమ రాష్ట్రాల్లోని కమ్యూనిటీ కార్యక్రమాల్లో బీజేపీ సీఎంలు పాల్గొన్నారు. కాగా.. ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రులు అయోధ్యను దర్శించాలని కోరినట్లు సమాచారం. ఎంపీలు కూడా అయోధ్య దర్శనం చేసుకోవాలని కోరినట్లు సమాచారం. అలాగే బీజేపీ ఎంపీలు తమ నియోజవర్గాల్లోని ప్రజలను అయోధ్యకు తీసుకెళ్లాలని పార్టీ అధిష్ఠానం కోరినట్లు సమాచారం.

ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యకు భక్తులు పోటెత్తారు. రోజూ లక్షలాది మంది బాలరాముడ్ని దర్శించుకుంటున్నారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలు సక్రమంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


Similar News