ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో వ్యక్తికి గుండెపోటు.. వైమానిక దళం స్పీడ్‌గా రియాక్ట్ అవడంతో..
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు.
దిశ, డైనమిక్ బ్యూరో : అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. రామకృష్ణా శ్రీవాస్తవ (65) ఆలయ ప్రాంగణం లోపల ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో ఇది గమనించిన భారత వైమానిక దళానికి చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించింది. వింగ్ కమాండర్ మనీష్ గుప్తా నేతృత్వంలోని భీష్మ్ క్యూబ్ టీమ్ సంఘటన జరిగిన నిమిషాల్లోనే అతడికి వైద్యం అందేలా చర్యలు తీసుకుంది. ప్రాథమిక అంచనా ప్రకారం శ్రీవాస్తవ రక్తపోటు స్థాయి 210/170 ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు కనుకొన్నారని సమాచారం. ఇక గుండెపోటుకు గురైన సమయంలో గోల్డెన్ అవర్స్‌గా భావించే తొలిగంటలో వైద్యం అందడంతో ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.