శ్రీరాముడి కోసం అద్భుత వస్త్రాలు.. ఏకంగా 12 లక్షల మంది..!!

ఈ నెల (జనవరి)22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది

Update: 2024-01-17 07:57 GMT

దిశ, ఫీచర్స్: ఈ నెల (జనవరి)22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులను ఈ వేడుకలకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశారు. అయితే శ్రీరాముడి కోసం రెండు పోగులు (దో ధాగే శ్రీరామ్‌కే లియే) పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పుణె జిల్లాలోని చేనేత కార్మికులందరూ తలో చెయ్యి వేసి ఈ వస్త్రాలు నేశారు. శ్రీరాముడి కోసం ఏకంగా 12 లక్షల మంది భక్తులు నేశారు. ఆ వస్త్రాలను తాజాగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ వారికి అందజేసి.. ట్రస్ట్‌ బృందాన్ని ఆయన అభినందించారు.


Similar News