ఒక్క రోజే 9,987 కొత్త కేసులు

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఒక్కరోజులో తొమ్మిది వేలకుపైగా కేసులు నమోదవడం సాధారణమైపోయింది. మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌ వెల్లడించే సమయానికి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 10వేలకు అతి చేరువలో పాజిటివ్ కేసులు నమోదయినట్లయింది. కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 2,66,598కి చేరాయి. గడిచిన వారం రోజుల్లోనే […]

Update: 2020-06-09 12:12 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఒక్కరోజులో తొమ్మిది వేలకుపైగా కేసులు నమోదవడం సాధారణమైపోయింది. మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌ వెల్లడించే సమయానికి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 10వేలకు అతి చేరువలో పాజిటివ్ కేసులు నమోదయినట్లయింది. కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 2,66,598కి చేరాయి. గడిచిన వారం రోజుల్లోనే 67 వేల పాజిటివ్ కేసులు నమోదుకావడం గమనార్హం. ఒక్కరోజే కరోనాతో 331 మంది చనిపోగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 7,466 మంది వ్యాధితో మరణించారు. దేశంలో ఇప్పటివరకు 1,29,215 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా 1,29,917 మంది ప్రస్తుతం వ్యాధితో పోరాడుతున్నారు. కరోనా మొత్తం కేసుల్లో దేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసులు చైనాతో పోలిస్తే మూడు రెట్లు అయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. దేశంలోనే ఇప్పటివరకు ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఒక్కరోజే 2,259పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 90,787కి చేరింది. దేశంలోని మహారాష్ట్రలో నమోదైన కేసులే చైనాలో మొత్తం కేసులను దాటేయడం గమనార్హం. ఇక్కడ ఒక్కరోజులోనే 120 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,289కి చేరింది. రాజధాని ముంబైలో ఒక్కరోజే 1015పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఒక్కరోజే 58 మంది కరోనాతో మరణించారు. ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 50,878కి చేరింది. తమిళనాడులో ఒక్కరోజే 1,685 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య34,914కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే 21 మంది మరణించడంతో ఇక్కడ ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 307కి చేరింది. గుజరాత్‌లో ఒక్కరోజే 470 కొత్త కేసులు నమోదవగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,044కు చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 33 మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటివరకు ఇక్కడ వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 1,313కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 147 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 3,990కి చేరింది. ఇక్కడ ప్రస్తుతం 1510 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 77 మంది మరణించారు.

Tags:    

Similar News