ఆమె ఒంటిపైనున్న టాటూల ఖరీదు రూ. 88 లక్షలు
దిశ, వెబ్‌డెస్క్ : పచ్చబొట్టు ఇప్పుడో ‘స్టైల్’ ఐకాన్, ఇన్‌స్పిరేషన్ సింబల్, సెలబ్రిటీ స్టేటస్. సరదాకు లేదా సెంటిమెంట్‌తో కొందరైతే.. అభిమాన హీరోనో, ఫేవరెట్ క్రికెటరో ఇన్‌స్పిరేషన్‌గా మరికొందరు.. ఇలా టాటూ వేయించుకోవడానికి కారణాలు అనేకం. ప్రస్తుతం టాటూలపై యువతలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఆ క్రేజ్ కాస్త వ్యసనంగా, విపరీత ధోరణిగా మారిపోయింది. మొన్నటిదాకా చిన్నపాటి గుర్తులు, అక్షరాలనే టాటూగా వేసుకునే యూత్.. ఇప్పుడు విభిన్నమైన ఆకృతులు, డిజైన్లతో శరీరాన్ని నింపేస్తున్నారు. అలా ఓ యువతి […]
దిశ, వెబ్‌డెస్క్ : పచ్చబొట్టు ఇప్పుడో ‘స్టైల్’ ఐకాన్, ఇన్‌స్పిరేషన్ సింబల్, సెలబ్రిటీ స్టేటస్. సరదాకు లేదా సెంటిమెంట్‌తో కొందరైతే.. అభిమాన హీరోనో, ఫేవరెట్ క్రికెటరో ఇన్‌స్పిరేషన్‌గా మరికొందరు.. ఇలా టాటూ వేయించుకోవడానికి కారణాలు అనేకం. ప్రస్తుతం టాటూలపై యువతలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఆ క్రేజ్ కాస్త వ్యసనంగా, విపరీత ధోరణిగా మారిపోయింది. మొన్నటిదాకా చిన్నపాటి గుర్తులు, అక్షరాలనే టాటూగా వేసుకునే యూత్.. ఇప్పుడు విభిన్నమైన ఆకృతులు, డిజైన్లతో శరీరాన్ని నింపేస్తున్నారు. అలా ఓ యువతి తన ఒళ్లంతా టాటూలు వేసుకుని ‘టాటూ గర్ల్’గా మారిపోయింది.
ఆస్ట్రేలియా, న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన అంబర్ ల్యూక్.. తన శరీరాన్ని 98% టాటూలతో నింపేసుకుంది. కొన్నేళ్ల కిందట ఆమె చాలా అందంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఒంటినిండా టాటూలతో ఉన్న ఆమెను చూస్తే మాత్రం గుర్తుపట్టడం కష్టమే. అంతేకాదు ఈ 25 ఏళ్ల ఇన్‌స్టాగ్రామ్ మోడల్.. కేవలం టాటూల కోసమే రూ.88 లక్షలు ఖర్చుపెట్టింది. తన టాటూ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఆమెకు ఫ్యాన్స్ కూడా పెరిగారు. 18 ఏళ్ల వయసు నుంచి టాటూలు ఎక్కువగా వేయించుకోవడం మొదలుపెట్టిన ల్యూక్.. ఐదారేళ్లలోనే ఒళ్లంతా టాటూలతో నింపేసింది. తను టాటూలు వేయించుకోక ముందున్న ఫొటోలను, ఆ తర్వాతి ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటే.. ఆమెలో ఎంత మార్పు వచ్చిందో ఈజీగా తెలిసిపోతోంది.
‘నేను చాలా డిప్రెషన్‌లో ఉండేదాన్ని. సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. నాకు నేను అస్సలు నచ్చను. ఈ లక్షణాలే నన్ను ఇలా టటూ గర్ల్‌గా మార్చాయి. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నేను ఇలా ఉండటాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాను’ అని ల్యూక్ అంటోంది. అంతేకాదు ల్యూక్ టాటూల కోసం తన కళ్లను కూడా వదిలిపెట్టలేదు. తన నేత్రల్లోని ‘ఐ బాల్స్’లో కూడా బ్లూ ఇంక్‌ను ఇంజెక్ట్ చేయించుకుంది. దాంతో ఆమె కళ్లు పోయినంత పనైంది. దాదాపు మూడు వారాలపాటు ఆమెకు కళ్లు కనపడలేదు. తర్వాత మెల్లిమెల్లిగా తన చూపు తిరిగి రావడంతో.. ఇప్పుడు అన్నీ చూడగలుగుతోంది.