కరోనాను జయించిన 95 ఏళ్ల బామ్మ
దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంత బజార్ కాలనీలో పాజిటివ్ వచ్చిన 95 ఏళ్ల బామ్మకు ప్రస్తుతం కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. గత నెల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న బామ్మకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వెంటనే అధికారులు హోం ఐసోలేషన్ చేశారు. అనంతరం వైద్యుల సూచనలు, కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లోనే వైద్యం తీసుకొని కోలుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉండటంతో మరోసారి కరోనా పరీక్షలు […]
దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంత బజార్ కాలనీలో పాజిటివ్ వచ్చిన 95 ఏళ్ల బామ్మకు ప్రస్తుతం కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. గత నెల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న బామ్మకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వెంటనే అధికారులు హోం ఐసోలేషన్ చేశారు. అనంతరం వైద్యుల సూచనలు, కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లోనే వైద్యం తీసుకొని కోలుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉండటంతో మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు కరోనా నెగెటివ్ రిపోర్ట్ రావడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఊపిరిపీల్చుకున్నారు.
కరోనా మహమ్మారి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులకు, చిన్నారులకు ఎక్కువ ప్రభావం చూపుతుందని విన్నాం. కానీ, 95 ఏళ్ల ఈ వృద్ధురాలు కరోనాకు భయపడకుండా వైద్యులు ఇచ్చిన సూచనలు సక్రమంగా పాటించి కరోనాను జయించింది. బామ్మకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్ ముగ్గురికి కరోనా పాజిటివ్ రాగా వారు ఇంకా హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతూ ఉన్నారు.