ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు 95.55% వ్యాక్సినేషన్
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా ఫ్రంట్‌లైన్‌వారియర్స్ కు ప్రభుత్వం ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్ చేస్తోంది. ఈ నెల 11 నుంచి 15 వరకూ వ్యాక్సినేషన్ స్పెషల్ క్యాంపెయిన్ ను ప్రభుత్వం చేపట్టింది. అయితే సెలవులు, పండుగలు ఉన్న నేపథ్యంలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌శాఖ పరిధిలో పనిచేస్తున్న వారిలో 95.55శాతం మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయినట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా ఫ్రంట్‌లైన్‌వారియర్స్ కు ప్రభుత్వం ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్ చేస్తోంది. ఈ నెల 11 నుంచి 15 వరకూ వ్యాక్సినేషన్ స్పెషల్ క్యాంపెయిన్ ను ప్రభుత్వం చేపట్టింది. అయితే సెలవులు, పండుగలు ఉన్న నేపథ్యంలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌శాఖ పరిధిలో పనిచేస్తున్న వారిలో 95.55శాతం మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయినట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లోని 95.55 మాతం సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయగా.. జీహెచ్ఎంసీలో 96.19శాతం మందికి కరోనా వ్యాక్సిన్ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. వీలైనంత త్వరగా వందశాతం పూర్తి చేస్తామని మంత్రి వివరించారు.