9తీర్మానాలకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం
దిశ, న్యూస్బ్యూరో: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీడిమెట్ల, ఫతుల్లాగూడలో నెలకొల్పిన నిర్మాణ వ్యర్థాలు, శిథిలాల రీసైక్లింగ్ ప్లాంట్ల వద్ద ఆరుగురు అసిస్టెంట్లను న్యాక్ నుంచి ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియమించడంతో పాటు 9 అంశాలను చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో కమిషనర్ లోకేష్ కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు గంధం జోత్స్న, ముద్రబోయిన శ్రీనివాసరావు, మీర్ బాసిత్ అలీ, మిర్జా ముస్తఫా […]
దిశ, న్యూస్బ్యూరో: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీడిమెట్ల, ఫతుల్లాగూడలో నెలకొల్పిన నిర్మాణ వ్యర్థాలు, శిథిలాల రీసైక్లింగ్ ప్లాంట్ల వద్ద ఆరుగురు అసిస్టెంట్లను న్యాక్ నుంచి ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియమించడంతో పాటు 9 అంశాలను చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో కమిషనర్ లోకేష్ కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు గంధం జోత్స్న, ముద్రబోయిన శ్రీనివాసరావు, మీర్ బాసిత్ అలీ, మిర్జా ముస్తఫా బేగ్, సున్నం రాజ్‌మోహన్, మహ్మద్ నజీర్ ఉద్దీన్, మహ్మద్ మాజిద్ హుస్సేన్, ముఠా పద్మనరేష్, కొలను లక్ష్మి పాల్గొన్నారు.