ఖమ్మం జిల్లాలో తాజాగా తొమ్మిది కేసులు
దిశ, ఖమ్మం: జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శనివారం నేలకొండపల్లికి చెందిన వ్యాపారికి కరోనా నిర్ధారణ కాగా, తాజాగా అతని కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి, అలాగే ఆ వ్యాపారికి చెందిన దుకాణంలో పనిచేస్తున్న ఐదుగురికి.. మొత్తంగా ఎనిమిది మందికి కరోనా సోకింది. ఈమేరకు జిలా వైద్యాధికారిణి మాలతి అధికారికంగా వెల్లడించారు. ఈ ఎనిమిది మందిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులను జిల్లా ఆసుపత్రిలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కరోనా కేసులు పెరుగుతున్న […]
దిశ, ఖమ్మం: జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శనివారం నేలకొండపల్లికి చెందిన వ్యాపారికి కరోనా నిర్ధారణ కాగా, తాజాగా అతని కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి, అలాగే ఆ వ్యాపారికి చెందిన దుకాణంలో పనిచేస్తున్న ఐదుగురికి.. మొత్తంగా ఎనిమిది మందికి కరోనా సోకింది. ఈమేరకు జిలా వైద్యాధికారిణి మాలతి అధికారికంగా వెల్లడించారు. ఈ ఎనిమిది మందిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులను జిల్లా ఆసుపత్రిలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేలకొండపల్లిని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. పట్టణంలోకి వచ్చే దారులన్నీ మూసివేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఖమ్మం రూరల్ ఏసీపీ సోమా వెంకటరెడ్డి, కూసుమంచి సీఐ మురళి పర్యవేక్షిస్తున్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో 14 రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ కొనసాగుతుందని సర్పంచ్ రాయపూడి నవీన్ తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు షాపులు తెరవకూడదని స్పష్టం చేశారు. ఇక మధిర మండల కేంద్రంలో మరో కేసు నమోదైంది. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఆదివారం ఒక్కరోజే తొమ్మిది కేసులు నమోదు కావడంతో జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు.