చెన్నూరులో 9 పాజిటివ్ కేసులు
దిశ, చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం 21 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో తొమ్మిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారంతా స్థానిక పట్టణంలోని కొత్తగూడెం, పాత బస్టాండు, ఆదర్శనగర్, గాంధీచౌక్, కోట బొగుడ, పద్మా నగర్, చెన్నూరు మండలం కత్తెర శాల గ్రామానికి చెందిన వారిగా తెలిపారు. దీంతో వారితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న వారి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.