విమానం నడిపిన 84 ఏళ్ల బామ్మ.. వీడియో వైరల్

దిశ, ఫీచర్స్: ప్రతీ మనిషికి అనేక కోరికలుంటాయి. కొంతమంది అవి తీర్చుకోవడానికి క్షణకాలం కూడా పట్టకపోవచ్చు కానీ మరికొంతమందికి మాత్రం వాటికోసం జీవితకాలం ఎదురుచూడొచ్చు. కానీ అమెరికాకు చెందిన మైర్తా గేజ్ మాత్రం తన ఎర్లీ ఏజ్‌లోనే పైలట్‌గా మారి ఆకాశంలో విహరించి అనుకున్నది సాధించిది. అయితే 84 ఏళ్ల మైర్తా గేజ్ పార్కిన్సన్స్ వ్యాధికి గురైనప్పుడు, ఆమె మరోసారి పైలట్‌గా మారాలనుకుంది. ఈ క్రమంలోనే ఆమె కుమారుడు అది నిజం చేశాడు. 84 ఏళ్ల గేజ్ […]

Update: 2021-10-18 08:56 GMT

దిశ, ఫీచర్స్: ప్రతీ మనిషికి అనేక కోరికలుంటాయి. కొంతమంది అవి తీర్చుకోవడానికి క్షణకాలం కూడా పట్టకపోవచ్చు కానీ మరికొంతమందికి మాత్రం వాటికోసం జీవితకాలం ఎదురుచూడొచ్చు. కానీ అమెరికాకు చెందిన మైర్తా గేజ్ మాత్రం తన ఎర్లీ ఏజ్‌లోనే పైలట్‌గా మారి ఆకాశంలో విహరించి అనుకున్నది సాధించిది. అయితే 84 ఏళ్ల మైర్తా గేజ్ పార్కిన్సన్స్ వ్యాధికి గురైనప్పుడు, ఆమె మరోసారి పైలట్‌గా మారాలనుకుంది. ఈ క్రమంలోనే ఆమె కుమారుడు అది నిజం చేశాడు.

84 ఏళ్ల గేజ్ పార్కిన్సన్ తో బాధపడుతూ రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అయితే ఆమెకు సంతోషాన్ని అందివ్వడానికి తన కుటుంబ సభ్యులు ఆమె కోరికల జాబితాను రూపొందించారు. ఇందులో పైలట్‌గా మరోసారి విమానం నడపాలని ఆమె కోరుకుంది. ఈ మేరకు గేజ్ కుమారుడు ఎర్ల్ పైలట్‌ను సంప్రదించాడు. దీంతో విన్నిపెసౌకీ సరస్సు మీదుగా మౌంట్ కియర్‌సర్జ్‌పై ఆమెను తీసుకెళ్లడానికి అతడు అంగీకరించాడు. తోటి ఏవియేటర్‌కి సహాయపడే ప్రయత్నంలో, ఒకసారి గాలిలో ఉన్నప్పుడు, పైలట్ మాటియెల్లో విమానం నియంత్రణను గేజ్‌కు అప్పగించాడు. గేజ్ విమానం నడుపుతున్న వీడియోలు, చిత్రాలు మాటియెల్లో ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో నెట్టింట్లో అవి వైరల్‌గా మారాయి.

క్లిప్ చూసిన తర్వాత చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. ‘ఒకప్పుడే కాదు ఆమె ఎప్పటికీ పైలట్’ అని ఒక యూజర్ రాయగా, ‘అనారోగ్యం ఉన్నప్పటికీ ఆమె విమానం నడిపే సమయంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించింది. ఇది మాలో స్పూర్తినింపింది’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.

Tags:    

Similar News