తమిళనాడు రాజ్‌భవన్‌లో 84మందికి..
చెన్నై: తమిళనాడు గవర్నర్ నివాసముండే చెన్నైలోని రాజ్‌భవన్‌లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇందులో విధులు నిర్వర్తిస్తున్న 147మంది భద్రత, అగ్నిమాపక సిబ్బందికి వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని పరీక్షించగా, 84మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని రాజ్‌భవన్ తన అధికారిక ప్రకటనలో గురువారం వెల్లడించింది. అయితే, వీరెవరూ గవర్నర్‌తోగానీ, ఉన్నతాధికారులతోగానీ కాంటాక్ట్‌లో లేరని స్పష్టం చేసింది. ప్రస్తుతం బాధితులందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. అయితే, ముగ్గురు వ్యక్తుల వల్లే రాజ్‌భవన్‌లోకి […]
చెన్నై: తమిళనాడు గవర్నర్ నివాసముండే చెన్నైలోని రాజ్‌భవన్‌లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇందులో విధులు నిర్వర్తిస్తున్న 147మంది భద్రత, అగ్నిమాపక సిబ్బందికి వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని పరీక్షించగా, 84మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని రాజ్‌భవన్ తన అధికారిక ప్రకటనలో గురువారం వెల్లడించింది. అయితే, వీరెవరూ గవర్నర్‌తోగానీ, ఉన్నతాధికారులతోగానీ కాంటాక్ట్‌లో లేరని స్పష్టం చేసింది. ప్రస్తుతం బాధితులందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. అయితే, ముగ్గురు వ్యక్తుల వల్లే రాజ్‌భవన్‌లోకి వైరస్ వ్యాపించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వారు రాజ్‌భవన్ ప్రధాన భవనంలో పని చేయరని, మెయిన్ గేట్ వద్ద విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. పాజిటివ్‌గా తేలిన అనంతరం రాజ్‌భవన్ ప్రాంగణం మొత్తాన్ని డిసిన్ఫెక్ట్ చేసినట్టు తెలిపారు.