భద్రాద్రిలో 84 కరోనా కేసులు
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లోపే 50కిపైగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ వివరాల ప్రకారం.. 16 జూలై 2020 నాటికి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇతర జిల్లాలలో గుర్తించిన కేసులు 18 కాగా, జిల్లాలోని వివిధ మండలాల్లో 66 కేసులు గుర్తించారు. జిల్లాలో ఇప్పటివరకూ మొత్తం 84 కరోనా కేసులు గుర్తించడం జరిగిందని డీఎంహెచ్‌వో […]
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లోపే 50కిపైగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ వివరాల ప్రకారం.. 16 జూలై 2020 నాటికి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇతర జిల్లాలలో గుర్తించిన కేసులు 18 కాగా, జిల్లాలోని వివిధ మండలాల్లో 66 కేసులు గుర్తించారు. జిల్లాలో ఇప్పటివరకూ మొత్తం 84 కరోనా కేసులు గుర్తించడం జరిగిందని డీఎంహెచ్‌వో భాస్కర్ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. మండలాల వారీగా అశ్వాపురం 1, భద్రాచలం 1, బూర్గంపాడు 1, చండ్రుగొండ 1, చుంచుపల్లి 6, దుమ్ముగూడెం 1, గుండాల 6, కొత్తగూడెం 28, లక్ష్మీదేవిపల్లి 3, మణుగూరు 2, పాల్వంచ 22, పినపాక 1, సుజాతనగర్ 5, టేకులపల్లి 1, ఇల్లెందు 5 మొత్తం కలిపి 84 కేసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల వారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం చికిత్సలో 53 కేసులు ఉన్నట్టు తెలిపారు. ఇంతవరకూ 30 మంది కోలుకున్నారని తెలిపారు. కాగా ఒకరు వైరస్ మూలంగా చనిపోవడం గమనార్హం.