రేర్ ఫీట్.. 15 గంటల్లో 7 కోటలు ఎక్కేసిన గర్ల్

దిశ, ఫీచర్స్ : గొప్ప సంకల్పానికి అకుంఠిత దీక్ష తోడైతే, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చనే మాటలను తొషికా పాటిల్ అనే ఎనిమిదేళ్ల బాలిక నిజం చేసింది. మహారాష్ట్రలోని పురాతన, ఎత్తైన ఏడు కోటలను 15 గంటల 30 నిమిషాల్లో ట్రెక్కింగ్ చేసి రికార్డు సృష్టించింది. తొషికా చేసిన ఆ అరుదైన ఫీట్ విశేషాలు మీ కోసం.. నాసిక్‌కు చెందిన తొషికా పాటిల్‌కు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. యోగా, సైక్లింగ్ చేస్తూ ఉండే ఈ యంగ్ […]

Update: 2021-03-14 03:10 GMT

దిశ, ఫీచర్స్ : గొప్ప సంకల్పానికి అకుంఠిత దీక్ష తోడైతే, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చనే మాటలను తొషికా పాటిల్ అనే ఎనిమిదేళ్ల బాలిక నిజం చేసింది. మహారాష్ట్రలోని పురాతన, ఎత్తైన ఏడు కోటలను 15 గంటల 30 నిమిషాల్లో ట్రెక్కింగ్ చేసి రికార్డు సృష్టించింది. తొషికా చేసిన ఆ అరుదైన ఫీట్ విశేషాలు మీ కోసం..

నాసిక్‌కు చెందిన తొషికా పాటిల్‌కు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. యోగా, సైక్లింగ్ చేస్తూ ఉండే ఈ యంగ్ గర్ల్.. చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి పలు ప్రదేశాలకు ట్రెక్కింగ్‌కు వెళ్లేది. అక్కడ ఎవరి సాయం లేకుండానే ట్రెక్కింగ్ చేస్తూ, ఫ్యామిలీ మెంబర్స్‌ను ఆశ్చర్యపరిచేది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో ఉండే కల్సుబాయి పర్వతాలను కూడా సులువుగా ఎక్కేసింది. కాగా తొషికాకు ట్రెక్కింగ్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్‌ను గుర్తించిన తల్లిదండ్రులు.. ఆమెకు మరిన్ని మెళకువలు నేర్పించేందుకు ట్రైనర్ వద్ద జాయిన్ చేశారు. ఈ మేరకు ట్రెక్కింగ్‌లో ఎక్స్‌పర్ట్ అయిన తొషిక, ఇటీవలే అరుదైన ఫీట్ పూర్తిచేసింది. పుణెకు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే టికొనా ఫోర్ట్ నుంచి మొదలుకుని తుంగ్, కొరిగడ్, లోహెగడ్, విసపూర్, మనరంజన్, శ్రీవర్ధన్ వరకు మొత్తం 7 కోటలను ఒకే రోజులో ఎక్కేసింది. పొద్దున 5.30 గంటలకు మావల్ తహసీల్‌లోని టికొనా కోట వద్ద ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన తొషిక.. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ 15 గంటల 30 నిమిషాల్లో ఏడు కొండలను ఎక్కేసి ఔరా అనిపించింది. కాగా గైడ్ సలహాలు, సహకారంతోనే తను ఈ అరుదైన ఫీట్ చేశానని తొషిక పేర్కొంది.

Tags:    

Similar News