కొండచిలువతో చిన్నారి స్నేహం.. నెటిజన్లు ఫిదా!
దిశ, వెబ్‌డెస్క్ : మామూలు పాము కనిపిస్తేనే పరుగు అందుకుంటాం. అలాంటిది భారీ కొండచిలువ కనిపిస్తే.. ఇక అక్కడ ఉంటామా? వెనక్కి తిరిగి చూడకుండా క్షణాల్లో అక్కడి నుంచి జంప్ అవుతాం. కానీ ఓ చిన్నారి మాత్రం ఎంచక్కా పాముతో ఆడుకుంటోంది. దాంతో కలిసి ఈతకొడుతోంది. పెద్ద కొండచిలువతో కలిసి ఆడుకుంటున్న ఈ చిన్నారి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఇన్బార్ అనే ఎనిమిదేళ్ల పాప.. 11 అడుగుల పొడవైన భారీ […]
దిశ, వెబ్‌డెస్క్ : మామూలు పాము కనిపిస్తేనే పరుగు అందుకుంటాం. అలాంటిది భారీ కొండచిలువ కనిపిస్తే.. ఇక అక్కడ ఉంటామా? వెనక్కి తిరిగి చూడకుండా క్షణాల్లో అక్కడి నుంచి జంప్ అవుతాం. కానీ ఓ చిన్నారి మాత్రం ఎంచక్కా పాముతో ఆడుకుంటోంది. దాంతో కలిసి ఈతకొడుతోంది. పెద్ద కొండచిలువతో కలిసి ఆడుకుంటున్న ఈ చిన్నారి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఇన్బార్ అనే ఎనిమిదేళ్ల పాప.. 11 అడుగుల పొడవైన భారీ కొండచిలువతో స్నేహం చేస్తోంది. రోజూ పాముతోనే ఆడుకుంటూ దాన్ని మెడలో వేసుకుని ఇల్లంతా తిరుగుతోంది. అంతేకాదు ఇద్దరూ కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో హ్యాపీగా ఈత కొడతున్నారు. తన పెంపుడు కొండచిలువకు ‘బెల్లే’ అని ముద్దు పేరు పెట్టుకున్న ఇన్బార్.. చిన్ననాటి నుంచే బెల్లేతో ఆడుకోవడంతో ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగిపోయింది. అన్నట్లు బెల్లే కూడా పిల్లపాముగా ఉన్నప్పటి నుంచి అక్కడే పెరిగింది. ఇక కరోనా కారణంగా స్కూళ్లు తెరుచుకోకపోడంతో ఇన్బార్ తన బెల్లేతో టైమ్ స్పెండ్ చేస్తూ.. హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
‘ఇన్బార్, బెల్లేలు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్‌పూల్‌లో సరదాగా ఆడుకునేవారు. ఇప్పుడు ఇన్బార్‌తో పాటు పాము కూడా పెద్దది అయ్యింది. అయినా కూడా కలిసి ఈత కొడుతున్నారు’ అని ఇన్బార్ తల్లి రెజేవ్ అంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అనేక మంది నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చిన్నారులను అలా పాములతో ఆడిపించడం అంత శ్రేయస్కరం కాదు, వామ్మో అంత పెద్ద పాముతో ఏ మాత్రం భయం లేకుండా ఆడుకోవడమా? నేనైతే భయంతో వణికిపోయేవాడ్ని’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.