ఉదయం 11 గంటల వరకు 8.90 శాతం పోలింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి కనిపించడం లేదు. చాలా చోట్ల ప్రముఖులు తొలి రెండు గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటల వరకు 8.90 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఓటు వేసేందుకు సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉండటంతో గతంలో కన్నా ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.