24 గంటల్లో అమెరికాలో 776 కరోనా మరణాలు
అమెరికాలో గడిచిన 24 గంటల్లో 776 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 79,522కు చేరింది. ఒక్క రోజులో ఇంత తక్కువ స్థాయిలో మరణాలు సంభవించడం కొంత ఊరట కల్గిస్తోంది. గత రెండు నెలల నుంచి అమెరికాలో రోజుకు సగటున 1,500 నుంచి 2,500 వరకు మరణాలు నమోదుతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఆదివారం మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇక, పాజిటివ్ కేసుల విషయానికి వస్తే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 13,29,072 […]
అమెరికాలో గడిచిన 24 గంటల్లో 776 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 79,522కు చేరింది. ఒక్క రోజులో ఇంత తక్కువ స్థాయిలో మరణాలు సంభవించడం కొంత ఊరట కల్గిస్తోంది. గత రెండు నెలల నుంచి అమెరికాలో రోజుకు సగటున 1,500 నుంచి 2,500 వరకు మరణాలు నమోదుతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఆదివారం మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇక, పాజిటివ్ కేసుల విషయానికి వస్తే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 13,29,072 కేసులు నమోదు అయ్యాయి. ప్రధానంగా న్యూయార్క్ నగరంలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.