రికార్డుస్థాయిలో కరోనా మరణాలు
– ఒకే రోజు 71 మంది – 31 వేలు దాటిన పాజిటివ్ కేసులు దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా 71 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య వెయ్యి మార్కు (1008) దాటింది. మరోవైపు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,787కు చేరుకుంది. ప్రతీరోజు డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్యకంటే రెండున్నర రెట్లలో కొత్త పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయి. రెండో విడత లాక్‌డౌన్ […]
– ఒకే రోజు 71 మంది
– 31 వేలు దాటిన పాజిటివ్ కేసులు
దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా 71 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య వెయ్యి మార్కు (1008) దాటింది. మరోవైపు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,787కు చేరుకుంది. ప్రతీరోజు డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్యకంటే రెండున్నర రెట్లలో కొత్త పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయి. రెండో విడత లాక్‌డౌన్ ముగింపు దశకు వస్తున్నా కొత్తగా పుట్టుకొచ్చే కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. తొమ్మిది రాష్ట్రాల్లో వెయ్యి కంటే ఎక్కువ కేసులు నమోదైనా.. కొత్తగా వస్తున్న కేసులన్నీ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచే కావడం గమనార్హం. ముఖ్యంగా ఐదు నగరాలు, ఐదు రాష్ట్రాల్లోనే వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. ముంబయి, ఇండోర్, భోపాల్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై, ఢిల్లీ తదితర నగరాల నుంచే గరిష్ట స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడు మొత్తంమీద కొత్తగా 104 కేసులు నమోదైతే ఇందులో 94 ఒక్క చెన్నై నగరం నుంచే వెలుగుచూశాయి.
తెలంగాణలో కొత్తగా వచ్చిన ఏడు కేసులూ హైదరాబాద్ నగరంలోనే నమోదయ్యాయి. డిశ్చార్జిల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కొత్త కేసులు రోజూ పదుల సంఖ్యలో పుట్టుకొస్తూనే ఉన్నాయి. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య ఐదంకెలకు చేరువవుతోంది. ఇప్పటిదాకా 9915 కేసులు నమోదైతే ఇందులో 432 మంది చనిపోయారు. ముంబయి నగరంలో ఒక్క రోజులోనే 475 కొత్త కేసులు రావడంతో మొత్తం సంఖ్య 6457కు చేరుకుంది. రాష్ట్రం మొత్తం మీద చనిపోయినవారిలో 270 మంది ముంబయి నగరంలోనే ఉన్నారు. గుజరాత్‌లో కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. అహ్మదాబాద్ నగరంలోనే 2777 కేసులు ఉన్నాయి. ఇక మృతులను చూస్తే రాష్ట్రం మొత్తం మీద 197 మంది చనిపోతే ఈ నగరంలోనే 137 మంది ఉన్నారు.
భారత్ :
మొత్తం కేసులు : 31,787
మృతులు : 1008
రికవరీ : 7797
తెలంగాణ :
మొత్తం కేసులు : 1016
మృతులు : 25
రికవరీ : 406
ఆంధ్రప్రదేశ్ :
మొత్తం కేసులు : 1332
మృతులు : 31
రికవరీ : 287
Tags: India, Corona, positive Cases, Telangana, Maharashtra, Andhra pradesh