తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రాష్ట్రంలో కరోనా కేసులు నిన్న భారీగా పెరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటన్ ప్రకారం నిన్న 56,122 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో కొత్తగా 684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురి మరణించగా మొత్తం మరణాల సంఖ్య 1697కు చేరింది. కరోనా నుంచి 394 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,965 యాక్టివ్ కేసులు ఉండగా అందులో […]
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రాష్ట్రంలో కరోనా కేసులు నిన్న భారీగా పెరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటన్ ప్రకారం నిన్న 56,122 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో కొత్తగా 684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురి మరణించగా మొత్తం మరణాల సంఖ్య 1697కు చేరింది. కరోనా నుంచి 394 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,965 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 1,873 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇక నిన్న జీహెచ్ ఎంసీ పరిధిలో 184 కేసులు నమోదయ్యాయి.