24 గంటల్లో 67 మంది మృతి
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,718 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. 67 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. తాజాగా నమోదైనవాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 33,050కు చేరింది. ఇక మరణాల సంఖ్య1074కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి 8,324 మంది కోలుకున్నారని.. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 23,651 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో […]
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,718 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. 67 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. తాజాగా నమోదైనవాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 33,050కు చేరింది. ఇక మరణాల సంఖ్య1074కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్‌లో వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి 8,324 మంది కోలుకున్నారని.. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 23,651 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో కరోనా కేసుల నమోదులో మొదటి స్థానంలో ఉంది. అక్కడ ప్రస్తుతం పాజిటివ్ కేసులు 10 వేలకు(9,915) చేరువలో ఉన్నాయి. రెండోస్థానంలో గుజరాత్ 4,082 కేసులు, ఢిల్లీ 3,439 కేసులతో మూడో స్థానంలో నిలిచింది.
Tags: india, corona, bulletin, maharashtra, gujarat, delhi