ఆరులో ఆరత్ సిక్స్ ప్యాక్

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్ కు చెందిన చిన్నోడు.. రెండేళ్లకే తన జిమ్నాస్టిక్ స్కిల్స్ తో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. మూడేళ్లకు ఫుట్ బాల్ ఆటతో మెప్పించాడు. ఆరేళ్లకు తన ఆరు పలకల దేహంతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతడే ఆరత్ హోస్సెయిని. ఆరత్ ను చిన్నప్పటి నుంచి వాళ్ల నాన్న జిమ్నాస్టిక్, ఫుట్ బాల్, ఎక్సర్సైజ్ లో బాగా ట్రైన్ చేశారు. ఎప్పటికప్పుడు తన ముద్దుల కొడుకు ఫొటోలను ఇన్స్ స్టా […]

Update: 2020-05-28 04:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్ కు చెందిన చిన్నోడు.. రెండేళ్లకే తన జిమ్నాస్టిక్ స్కిల్స్ తో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. మూడేళ్లకు ఫుట్ బాల్ ఆటతో మెప్పించాడు. ఆరేళ్లకు తన ఆరు పలకల దేహంతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతడే ఆరత్ హోస్సెయిని.

ఆరత్ ను చిన్నప్పటి నుంచి వాళ్ల నాన్న జిమ్నాస్టిక్, ఫుట్ బాల్, ఎక్సర్సైజ్ లో బాగా ట్రైన్ చేశారు. ఎప్పటికప్పుడు తన ముద్దుల కొడుకు ఫొటోలను ఇన్స్ స్టా వేదికగా షేర్ చేసుకునేవారు. ఆరత్ ఇన్ స్టా అకౌంట్ కు ప్రస్తుతం 4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ వయసులో సిక్స్ ప్యాక్ పొందిన చిన్నోడిగా ఆరత్ నిలుస్తాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం లివర్ పుల్ లో ఉంటున్నాడు ఆరత్. మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు స్పైడర్ మ్యాన్ లా గోడలు ఎక్కుతుంటాడు. ఆ వీడియో అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆరత్ ఫుట్ బాల్ ఆడే వీడియో కూడా ప్రపంచ ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఆరత్ ఆ వీడియోలో లాంగ్ హెయిర్ ఉండటంతో.. అందరూ ఆరత్ ను అమ్మాయిగానే భావించారు. ఆరత్ కు ఫుట్ బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో అంటే చాలా ఇష్టం. తనలా కావాలని చిన్నప్పటి నుంచే ఎంతగానో కష్టపడుతున్నాడు. 9 నెలల వయసు నుంచే ఆరత్ కు జిమ్నాస్టిక్ లో వాళ్ల నాన్న ట్రైనింగ్ ఇచ్చారని చెబుతున్నాడు. ఏడాది వయసు వచ్చే సరికి ప్రతి రోజు 20 నిముషాలు ఆరత్ ట్రైనింగ్ కోసం కేటాయించేవారు.

ఒలింపిక్ చాంపియన్ కావడమే లక్ష్యం :

ఆరత్ కు ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం. స్పానిష్ సూపర్ క్లబ్ బార్సిలోనా జట్టులో ఆడాలని ఆరత్ ఆశపడుతున్నాడు. అంతేకాదు ఒలింపిక్ చాంపియన్ కావడమే తన లక్ష్యమని ఆరత్ అంటున్నాడు. ప్రస్తుతం లివర్ పూల్ ఆకాడమిలో ఫుట్ బాల్ శిక్షణ తీసుకుంటున్నాడు.

Tags:    

Similar News