ఆ పండక్కి ముందే పీఎఫ్ వడ్డీ జమయ్యే అవకాశం

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే పీఎఫ్ చందాదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.5 శాతం వడ్డే ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పండుగ సీజన్ నేపథ్యంలో పీఎఫ్ చందాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) వడ్డీని దీపావళికి ముందుగా ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల సుమారు 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు ప్రయోజనాలు కలగనున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాల్సిన వడ్డీ రేటు గత ఏడేళ్ల కాలంలోనే కనిష్టం. […]

Update: 2021-10-11 10:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే పీఎఫ్ చందాదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.5 శాతం వడ్డే ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పండుగ సీజన్ నేపథ్యంలో పీఎఫ్ చందాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) వడ్డీని దీపావళికి ముందుగా ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల సుమారు 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు ప్రయోజనాలు కలగనున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాల్సిన వడ్డీ రేటు గత ఏడేళ్ల కాలంలోనే కనిష్టం. ఇంతకుముందు 2018-19లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం, 2016-17లో 8.65 శాతం వడ్డీని ఇచ్చారు. 2020 నుంచి కొవిడ్ మహమ్మారి కారణంగా విత్‌డ్రా పెరగడం, సబ్‌స్క్రైబర్ల నుంచి నగదు జమ కూడా క్షీణించడంతో వడ్డీ తక్కువగానే నిర్ణయించారు.

కాగా, గత కొంతకాలంగా పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలకు సంబంధించి చందాదారులు జాగ్రత్తగా ఉండాలని ఈపీఎఫ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది. ఆధార్ నంబర్, పాన్‌కార్డ్, యూఏఎన్ నంబర్, బ్యాంకు అకౌంట్ వివరాలను ఎవ్వరికీ ఇవ్వకూడదని ఈపీఎఫ్ఓ హెచ్చరిక జారీ చేసింది. ఈపీఎఫ్ఓ ఏ సమాచారాన్నైనా ఫోన్ ద్వారా సేకరించదని, అలాంటి ఫోన్‌లు వస్తే స్పందించవచ్చని వెల్లడించింది.

Tags:    

Similar News