తెలంగాణలో 5వ కరోనా పాజిటివ్ కేసు
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఫిబ్రవరి 22న ఇండోనేషియా నుంచి మత ప్రచారక బృందం ఢిల్లీకు చేరుకుంది. ఆ బృందంలోని కొద్ది మంది సభ్యులు తెలంగాణలోని పలు జిల్లాల్లో మత ప్రచారం కోసం చేరుకున్నారు. ఇందులో ఒకరికి కరోనా లక్షణాలు ఉండటంతో గాంధీ ఆస్పత్రిలో చేర్చారు.ఇతనికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఇతను కరీంనగర్ జిల్లాలో మత ప్రచారం చేసే సభ్యుడిగా గుర్తించారు. ఇండోనేషియా నుంచి మత ప్రచారం చేయడానికి వచ్చిన మొత్తం సభ్యులు […]
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఫిబ్రవరి 22న ఇండోనేషియా నుంచి మత ప్రచారక బృందం ఢిల్లీకు చేరుకుంది. ఆ బృందంలోని కొద్ది మంది సభ్యులు తెలంగాణలోని పలు జిల్లాల్లో మత ప్రచారం కోసం చేరుకున్నారు. ఇందులో ఒకరికి కరోనా లక్షణాలు ఉండటంతో గాంధీ ఆస్పత్రిలో చేర్చారు.ఇతనికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఇతను కరీంనగర్ జిల్లాలో మత ప్రచారం చేసే సభ్యుడిగా గుర్తించారు. ఇండోనేషియా నుంచి మత ప్రచారం చేయడానికి వచ్చిన మొత్తం సభ్యులు ఎంతమంది, తెలంగాణలోకి వచ్చిన వారు ఎంతమంది, వీరు ఏయేఏయే ప్రాంతాల్లోతిరిగారు. తదితర వివరాలన్నింటిని రాష్ట్ర ప్రభుత్వ వైద్య అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇది 5వది అని అధికారులు పేర్కొన్నారు. మరికొద్ది నిమిషాల్లో ప్రభుత్వం అధికారింగా వెల్లడించనుంది.
TAGS ;5TH CASE, carona positive, karimnagar, community pracharak