కొవిడ్ కేర్ సెంటర్లుగా 5 స్టార్ హోటళ్లు.. రోగులు పెరిగితే మరిన్ని..!

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అయితే కరోనా వ్యాప్తి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో సెకండ్ వేవ్ తీవ్రత తొలుత ముంబైలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నెమ్మదిగా అది ఇతర రాష్ట్రాలను తాకి కల్లోలం సృష్టించింది. ప్రస్తుతం దేశంలో రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయంటే అందులో మహారాష్ట్ర కంట్రిబ్యూషన్ లేకపోలేదని చెప్పవచ్చును. గత కొంతకాలంగా నమోదవుతున్న కేసుల వలన ప్రస్తుతం […]

Update: 2021-04-15 12:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అయితే కరోనా వ్యాప్తి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో సెకండ్ వేవ్ తీవ్రత తొలుత ముంబైలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నెమ్మదిగా అది ఇతర రాష్ట్రాలను తాకి కల్లోలం సృష్టించింది. ప్రస్తుతం దేశంలో రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయంటే అందులో మహారాష్ట్ర కంట్రిబ్యూషన్ లేకపోలేదని చెప్పవచ్చును. గత కొంతకాలంగా నమోదవుతున్న కేసుల వలన ప్రస్తుతం మహరాష్ట్రలోని ఆస్పత్రుల్లో బెడ్స్ నిండుకున్నాయి.

దీంతో బృహన్ ముంబై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా కరోనా బారిన పడే రోగుల కోసం ముంబైలోని 5 స్టార్ హోటళ్ళలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యే్కంగా బెడ్స్‌ను కూడా రెడీ చేయిస్తున్నారు. సీరియస్ కండిషన్ లేని కొవిడ్ రోగులకు ఇందులో చికిత్స అందించనున్నారు. అందుకోసం ఇంటర్ కంటినెంటల్, ట్రై డెంట్ వంటి పేరుగాంచిన రెండు ఫైవ్ స్టార్ హోటల్లలో 42 బెడ్స్ ను ప్రిపేర్ చేసినట్లు బీఎంసీ గురువారం ప్రకటించింది. రానున్న రోజుల్లో రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని మరిన్ని హోటళ్లను కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఎంసీ స్పష్టంచేసింది.

Tags:    

Similar News