రెండో టెస్టుకు జోరుగా టికెట్ల అమ్మకాలు

దిశ, స్పోర్ట్స్ : కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో చెన్నైలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం కేవలం 50 శాతానికి మాత్రమే ప్రేక్షకులను పరిమితం చేయాలని చెప్పడంతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ 15000 టికెట్లు అమ్మకానికి పెట్టింది. లాక్‌డౌన్ అనంతరం తొలి సారిగా అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రేక్షకులను అనుమతిస్తుండటంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. 15 వేల […]

Update: 2021-02-10 09:51 GMT

దిశ, స్పోర్ట్స్ : కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో చెన్నైలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం కేవలం 50 శాతానికి మాత్రమే ప్రేక్షకులను పరిమితం చేయాలని చెప్పడంతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ 15000 టికెట్లు అమ్మకానికి పెట్టింది. లాక్‌డౌన్ అనంతరం తొలి సారిగా అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రేక్షకులను అనుమతిస్తుండటంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. 15 వేల టికెట్లు కేవలం గంట సేపట్లోనే అయిపోయినట్లు టీఎన్‌సీఏ తెలిపింది. పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై అమ్మిన ఈ టికెట్లను గురువారం ఉదయం 10 నుంచి విక్టోరియా హాస్టల్ రోడ్‌లో ఉన్న బూత్ నెంబర్ 3లో పంపిణీ చేయనున్నారు.

Tags:    

Similar News