ఎవరెస్ట్ పై 5జీ సేవలు

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోకెల్లా ఎత్తైన హిమాలయ పర్వతాలపై 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సముద్రం మట్టం నుంచి 6500 మీటర్ల ఎత్తులో.. చైనా ఏర్పాటు చేసిన బేస్ స్టేషన్ ల పనులు ప్రారంభం కావడంతో శిఖరం మీది వరకు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఏర్పాటు చేసిన బేస్ స్టేషన్ ఇదే కావడం విశేషం. చైనా నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే పర్వతారోహకులకు 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం రంగ […]

Update: 2020-05-02 05:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోకెల్లా ఎత్తైన హిమాలయ పర్వతాలపై 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సముద్రం మట్టం నుంచి 6500 మీటర్ల ఎత్తులో.. చైనా ఏర్పాటు చేసిన బేస్ స్టేషన్ ల పనులు ప్రారంభం కావడంతో శిఖరం మీది వరకు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఏర్పాటు చేసిన బేస్ స్టేషన్ ఇదే కావడం విశేషం.

చైనా నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే పర్వతారోహకులకు 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ ‘ చైనా టెలికాం’, స్మార్ట్ ఫోన్ల దిగ్గజం హువావే సహకారంతో 5జీ బేస్ స్టేషన్ ను నిర్మించింది. టిబెట్‌ చైనా సరిహద్దుల్లోని హిమాలయ పర్వతం వైపు ఈ సిగ్నల్‌ అందుబాటులో ఉంటుందని చైనా తెలిపింది. ప్రస్తుతం 5,800 మీటర్ల వరకు బేస్‌ క్యాంప్‌ లు ఉన్నాయి. ఎవరెస్ట్ పర్వతంపై పూర్తి స్థాయిలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు 5300 మీటర్లు, 5800 మీటర్ల ఎత్తున కూడా బేస్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారని చైనా అధికార వర్గాలు తెలిపాయి. 6,500 మీటర్ల వద్ద ఇటీవల నిర్మించిన బేస్‌ స్టేషన్‌లో పనులు ప్రారంభం కావడంతో శిఖరంపై వరకు 5జీ అందుబాటులోకి వచ్చింది. హై డెఫినేషన్ లైవ్ స్ట్రీమింగ్, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, సైంటిఫిక్ రీసెర్చ్, మౌంటెయిన్ క్లైంబింగ్, కార్యక్రమాలకు 5జీ సేవలు ఉపకరించనున్నాయి. 5300 మీటర్ల బేస్ స్టేషన్ వద్ద 5జీ డౌన్ లోడ్ స్పీడ్ 1.66 జీబీపీఎస్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఎవరెస్ట్‌పై 5జీ స్టేషన్లను నిర్మించడం చాలా శ్రమతో కూడుకున్నదని, వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు 14.2 లక్షల డాలర్ల ఖర్చవుతుందని చైనా అధికార వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులకు సమాచారం అందించడానికి 5జీ స్టేషన్లు సహాయపడతాయి. పర్వతారోహకులు, పరిశోధకులతో పాటు, సహాయ సిబ్బందికి కూడా 5జీ సేవలు ఉపయోగపడతాయి. 5జీ అనేది వైర్‌లెస్‌ కమ్యూనికేషన్ టెక్నాలజీలలో పెను మార్పులను తీసుకు రాబోంతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. గ్రేటర్ బ్యాండ్‌విడ్త్, ఫాస్ట్ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని 5జీ కలిగి ఉంటుంది. వర్చువల్ సమావేశాలు నిర్వహించుకోవడానికి, టెలిమెడిసిన్‌కు, డ్రైవర్ రహిత కార్లకు 5జీ మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.

Tags : evarest, 5g signal, china telecom, huwai,

Tags:    

Similar News