నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. పెరిగిన ఉద్యోగాల సంఖ్య

దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల లెక్క తేలింది. తొలి విడతలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇటీవల  సీఎం కేసీఆర్ ప్రకటించగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. మొత్తం 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి సీఎస్ నివేదిక ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ శాఖల్లో డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ పోస్టులు 44,022 ఉండగా… ఇనిస్టిట్యూషన్స్​లో 12,957 ఉన్నాయి. మొత్తం 56,979 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు […]

Update: 2021-07-14 05:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల లెక్క తేలింది. తొలి విడతలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. మొత్తం 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి సీఎస్ నివేదిక ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ శాఖల్లో డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ పోస్టులు 44,022 ఉండగా… ఇనిస్టిట్యూషన్స్​లో 12,957 ఉన్నాయి. మొత్తం 56,979 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నట్లు సీఎం కేసీఆర్​కు సీఎస్ నివేదిక అందించారు. పోలీస్​ శాఖలోనే ఎక్కువ ఖాళీలున్నట్లు నివేదికలో వెల్లడించారు.

పోలీస్​ శాఖలో 21,507 పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నట్లు నివేదించారు. ఆ తర్వాత వైద్యారోగ్య శాఖలో 10,048 పోస్టులు, ఉన్నత విద్యాశాఖలో 3,825 పోస్టులు, బీసీ వెల్ఫేర్​లో 3,538 పోస్టులు, ఎస్సీ వెల్ఫేర్​లో 1967, రెవెన్యూ విభాగంలో 1700 పోస్టులు భర్తీ చేయాలని నివేదికల్లో వెల్లడించారు. అత్యధికంగా ఐటీ విభాగంలో నాలుగు పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నట్లు తేల్చారు. రాష్ట్ర కేబినెట్​ భేటీ బుధవారం మధ్యాహ్నం మొదలైంది. ఈ కేబినెట్​లో ఈ పోస్టుల భర్తీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News