గణేష్ నిమజ్జనం స్పెషల్.. ట్యాంక్‌బండ్‌కు 565 బస్సులు
దిశ, డైనమిక్ బ్యూరో: గణేష్ ఉత్సవాలలో భాగంగా నేడు తొమ్మిదో రోజు కావడంతో హైదరాబాద్‌లో దాదాపు సగానికిపైగా గణనాథుల నిమజ్జనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలంతా హుస్సేన్‌సాగర్‌కు చేరుకోనున్నారు. అయితే, ట్యాంక్‌బండ్ వద్ద పార్కింగ్ సదుపాయం లేక భక్తులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతుంటారు. బస్సులు అందుబాటులో ఉండకపోవడంతో నగరవాసులు సొంత వాహనాలు, ట్యాక్సీ, ఆటోలలో నిమజ్జనాలు వీక్షించేందుకు వచ్చేవారు. దీనిపై దృష్టి సారించిన ఆర్టీసీ.. నగరం నలుమూలల నుంచి ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలకు […]
దిశ, డైనమిక్ బ్యూరో: గణేష్ ఉత్సవాలలో భాగంగా నేడు తొమ్మిదో రోజు కావడంతో హైదరాబాద్‌లో దాదాపు సగానికిపైగా గణనాథుల నిమజ్జనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలంతా హుస్సేన్‌సాగర్‌కు చేరుకోనున్నారు. అయితే, ట్యాంక్‌బండ్ వద్ద పార్కింగ్ సదుపాయం లేక భక్తులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతుంటారు. బస్సులు అందుబాటులో ఉండకపోవడంతో నగరవాసులు సొంత వాహనాలు, ట్యాక్సీ, ఆటోలలో నిమజ్జనాలు వీక్షించేందుకు వచ్చేవారు. దీనిపై దృష్టి సారించిన ఆర్టీసీ.. నగరం నలుమూలల నుంచి ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలకు 565 బస్సులను నడుపుతున్నట్టు ట్విట్టర్‌లో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ‘గణేష్ నిమజ్జనం స్పెషల్’ అనే బోర్డుతో ఈ బస్సులు నడపనున్నారు. అయితే ఈ బస్సు సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సజ్జనార్ సూచించారు.