దేశంలో కరోనా కేసులు 56342

• ఒక్కరోజే 3390 పాజిటివ్‌లు • 103 మంది మరణం దిశ, న్యూస్‌బ్యూరో : దేశంలో కరోనా వ్యాప్తి స్పీడు తగ్గడం లేదు. ఒక్కరోజులో వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవడం సాధారణమైపోయింది. ప్రపంచంలోనే కరోనాతో అత్యంత ఎఫెక్టయిన దేశాల్లో భారత్ 14వ స్థానంలో నిలిచింది. కాగా, అత్యధిక కొత్త కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్‌లు దేశంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాల్లో వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా కొత్తగా 3390 […]

Update: 2020-05-08 11:42 GMT

• ఒక్కరోజే 3390 పాజిటివ్‌లు
• 103 మంది మరణం

దిశ, న్యూస్‌బ్యూరో : దేశంలో కరోనా వ్యాప్తి స్పీడు తగ్గడం లేదు. ఒక్కరోజులో వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవడం సాధారణమైపోయింది. ప్రపంచంలోనే కరోనాతో అత్యంత ఎఫెక్టయిన దేశాల్లో భారత్ 14వ స్థానంలో నిలిచింది. కాగా, అత్యధిక కొత్త కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్‌లు దేశంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాల్లో వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా కొత్తగా 3390 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 56342కి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 16540 మంది కరోనా పేషెంట్లు డిశ్చార్జయ్యారు. కరోనాతో కొత్తగా 103 మంది చనిపోగా మొత్తం మరణించినవారి సంఖ్య 1886కు చేరింది. ఈ వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కొత్తగా 56 కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1833కు చేరింది. ఇక్కడ ఇప్పటివరకు 842 మంది డిశ్చార్జయ్యారు. వారం ముగ్గురు చనిపోగా రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి మొత్తం సంఖ్య 41కి చేరింది. ఇక్కడ హాట్‌స్పాట్‌లలో కాకుండా శుక్రవారం వేరే ప్రాంతాల్లో కేసులు నమోదవడం కలవరపెడుతోంది.

మహారాష్ట్రలో కొత్తగా 1089 పాజిటివ్ కేసులు నమోదవడంతో శుక్రవారం వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 19063కి చేరింది. ఇక్కడ కొత్తగా 37 మంది చనిపోగా మొత్తం మరణించినవారి సంఖ్య 731కి చేరింది. రాష్ట్ర రాజధాని ముంబైలో శుక్రవారం ఒక్కరోజే 748 కేసులు రికార్డు కాగా నగరంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 11967గా ఉన్నాయి. గుజరాత్‌లో ఒక్కరోజే 2330 కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8855కిచేరింది. తమిళనాడులో కొత్తగా 600 కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 6009కి వెళ్లింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1605 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. ఇప్పటివరకు 40 మంది చనిపోయారు. రాజధాని చెన్నైలో కొత్తగా శుక్రవారం 399 కేసులు రికార్డయ్యాయి.

Tags: coronavirus, india, cases, saturday

Tags:    

Similar News