రంగారెడ్డిలో 56మందికి కరోనా నెగెటివ్
దిశ, రంగారెడ్డి: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మధ్యే రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండలం చేగుర్ గ్రామంలో భారతమ్మ అనే మహిళ కరోనా బారిన పడి మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.రంగంలోకి దిగిన వైద్యా, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం చేగూర్ గ్రామం, షాద్ నగర్ నియోజక వర్గంలో హై అలర్ట్ ప్రకటించారు. భారతమ్మ ప్రైమరీ కాంటాక్ట్‌గా అనుమానిస్తున్న 57మందిని గుర్తించి […]
దిశ, రంగారెడ్డి: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మధ్యే రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండలం చేగుర్ గ్రామంలో భారతమ్మ అనే మహిళ కరోనా బారిన పడి మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.రంగంలోకి దిగిన వైద్యా, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం చేగూర్ గ్రామం, షాద్ నగర్ నియోజక వర్గంలో హై అలర్ట్ ప్రకటించారు. భారతమ్మ ప్రైమరీ కాంటాక్ట్‌గా అనుమానిస్తున్న 57మందిని గుర్తించి వారికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ఇతర రాష్ట్రానికి చెందిన ఒక్కరికి తప్ప మిగతా 56 మందికి నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులు అధికారికంగా వెల్లడించారు.దీంతో షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Tags: corona, lockdown, quarantine , 56 members got negative, rangareddy