నిజామాబాద్‌లో 55 పాజిటివ్ కేసులు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 55 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. జిల్లాలో యాభై కేసుల మార్క్ దాటడం ఇదే తొలిసారి. అయితే, కరోనాతో చికిత్స పొందుతూ ఓ ఆర్ఎస్‌ఐ, జిల్లా కేంద్రానికి చెందిన ఓక అధికార పార్టీ నేత తల్లి కరోనాతో చనిపోయారు. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 500లకు చేరువలో ఉంది. గత జూన్‌ నెలలో జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రారంభమైన కొవిడ్ సెంటర్‌లో మరణాల సంఖ్య క్రమంగా […]

Update: 2020-07-21 11:42 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 55 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. జిల్లాలో యాభై కేసుల మార్క్ దాటడం ఇదే తొలిసారి. అయితే, కరోనాతో చికిత్స పొందుతూ ఓ ఆర్ఎస్‌ఐ, జిల్లా కేంద్రానికి చెందిన ఓక అధికార పార్టీ నేత తల్లి కరోనాతో చనిపోయారు. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 500లకు చేరువలో ఉంది. గత జూన్‌ నెలలో జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రారంభమైన కొవిడ్ సెంటర్‌లో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 1 నుంచి 21వరకు మొత్తం 16మంది కరోనా వ్యాధితో చికిత్స పోందుతూ మరణించగా, నలుగురు మాత్రం ఇతర కారణాలతో చనిపోయారు.

Tags:    

Similar News