దేశవ్యాప్తంగా లక్షకు చేరువలో కరోనా
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత మరింత పెరిగింది. గడిచిన రెండు రోజులుగా రోజుకు 5 వేల చొప్పున కొత్త కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 5,242 కొత్త కేసులు నమోదవ్వడంతో మొత్తం బాధితుల సంఖ్య96,169కి చేరింది. ఈ మేరకు సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 157 మంది చనిపోడంతో మరణాల సంఖ్య 3,029కి చేరింది. ఇప్పటివరకు 36,824 […]
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత మరింత పెరిగింది. గడిచిన రెండు రోజులుగా రోజుకు 5 వేల చొప్పున కొత్త కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 5,242 కొత్త కేసులు నమోదవ్వడంతో మొత్తం బాధితుల సంఖ్య96,169కి చేరింది. ఈ మేరకు సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 157 మంది చనిపోడంతో మరణాల సంఖ్య 3,029కి చేరింది. ఇప్పటివరకు 36,824 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 56,316 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్ర, గజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లోనే 65 వేల కేసులు ఉన్నాయి.
మహారాష్ట్రలో ఒక్కరోజే 2,347 పాజిటివ్ కేసులు నవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 33,053కు చేరింది. అక్కడ ఒక్కరోజులో 2వేలకుపైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. సోమవారం కరోనాతో 63 మంది చనిపోయారు. గుజరాత్‌లో ఒక్కరోజే 421 కొత్త కేసులు వెలుగుచూడడంతో మొత్తం కేసుల సంఖ్య 11,379కి చేరింది. ఇక్కడ ఇప్పటివరకు 659 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఇక్కడ సోమవారం ఒక్కరోజే 639 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 11,224కు చేరింది. ఇక్కడ కరోనాతో మొత్తం 78 మంది ప్రాణాలు విడిచారు. ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 721 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ ఇప్పటివరకు రికార్డైన మొత్తం కేసుల సంఖ్య 10,054కు చేరింది. ఇప్పటివరకు వ్యాధి బారినపడి 160 మంది మరణించారు. ఏపీలో సోమవారం కొత్తగా 52 పాజిటివ్ కేసులు రికార్డవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,282కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు వ్యాధి నుంచి 1,527 మంది కోలుకోగా 50 మంది చనిపోయారు.