50వేల మంది ఉద్యోగులకు PRC అందట్లేదు : ఎమ్మెల్యే రఘునందన్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ప్రకటించిందని, అయితే 1 జూలై 2018 తర్వాత పలు శాఖల్లో చేరిన సుమారు 50 వేల మంది ఉద్యోగులకు ఈ పీఆర్సీ, ఫిట్‌మెంట్​అమల్లోకి రాలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. కొత్తగా చేరిన ఉద్యోగులకు పీఆర్సీ, ఫిట్‌మెంట్ అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీరందరికీ 30 […]

Update: 2021-10-01 03:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ప్రకటించిందని, అయితే 1 జూలై 2018 తర్వాత పలు శాఖల్లో చేరిన సుమారు 50 వేల మంది ఉద్యోగులకు ఈ పీఆర్సీ, ఫిట్‌మెంట్​అమల్లోకి రాలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

కొత్తగా చేరిన ఉద్యోగులకు పీఆర్సీ, ఫిట్‌మెంట్ అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీరందరికీ 30 శాతం పీఆర్సీని అమలుచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులకు 30 శాతం పీఆర్సీ అందజేస్తుందో లేదో క్లారిటీ ఇవ్వాలని రఘునందన్​రావు డిమాండ్​చేశారు.

 

Tags:    

Similar News