కాళేశ్వరం ప్రాజెక్టులో 5వేల కోట్ల స్కాం : నాగం
దిశ, నాగర్‌కర్నూల్: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నీటి దోపిడీపై మండలస్థాయి నుంచి ప్రజా ఉద్యమం చేపడుతున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై ఈ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ఆదివారం తన గృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నాగం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం దొంగలు, దోపిడీదారులకు అడ్డాగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 5 […]
దిశ, నాగర్‌కర్నూల్: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నీటి దోపిడీపై మండలస్థాయి నుంచి ప్రజా ఉద్యమం చేపడుతున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై ఈ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ఆదివారం తన గృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నాగం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం దొంగలు, దోపిడీదారులకు అడ్డాగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 5 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై అన్ని సాక్ష్యాలు ఉన్నందునే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిపై కూడా త్వరలో ఉద్యమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు అర్థం రవి, కోటయ్య, కౌన్సిలర్లు నిజాముద్దీన్, సుల్తాన్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.