ఓ వైపు హరితహారం అంటునే.. మరోవైపు చెట్లకు నిప్పు పెడుతున్నారు

దిశ, జనగామ : చెత్త కు బదులుగా ఏకంగా చెట్లకు నిప్పు పెట్టిన సంఘటన జనగామ వ్యవసాయ మార్కెట్ లో చోటుచేసుకుంది. నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగే వరకు కాపాడాల్సిన బాధ్యత జనగామ అధికారులకు లేక పోయింది. గత రెండు సంవత్సరాల క్రితం హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు కాస్త పెద్దవి అవుతుండగా చెట్ల నుండి రాలిపోయిన ఆకులకు మార్కెట్ సిబ్బంది నిప్పంటించారు. ఈక్రమంలో నిప్పు రవ్వలు భారీగా ఎగిసి పోవడంతో నీడనిచ్చే 50 చెట్ల్లు పూర్తిగా […]

Update: 2021-04-08 02:00 GMT

దిశ, జనగామ : చెత్త కు బదులుగా ఏకంగా చెట్లకు నిప్పు పెట్టిన సంఘటన జనగామ వ్యవసాయ మార్కెట్ లో చోటుచేసుకుంది. నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగే వరకు కాపాడాల్సిన బాధ్యత జనగామ అధికారులకు లేక పోయింది. గత రెండు సంవత్సరాల క్రితం హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు కాస్త పెద్దవి అవుతుండగా చెట్ల నుండి రాలిపోయిన ఆకులకు మార్కెట్ సిబ్బంది నిప్పంటించారు. ఈక్రమంలో నిప్పు రవ్వలు భారీగా ఎగిసి పోవడంతో నీడనిచ్చే 50 చెట్ల్లు పూర్తిగా ఖాళీ పోయాయి. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం చెట్లను పెంచండి అని అధికారులకు ఆదేశాలు ఇస్తుండగా జనగామ వ్యవసాయ మార్కెట్లో మాత్రం ఆ ఆదేశాలు అమలుకు నోచుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఘటనపై మార్కెట్ ఆధికారులు సిబ్బంది పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags:    

Similar News