కరోనాతో 50మంది డాక్టర్లు మృతి
ప్రపంచం మొత్తం కరోనావైరస్ కారణంగా అతలాకుతలం కాగా.. ఇటలీలో వైరస్ విజృంభించి విలయతాండవం చేసింది. దాదాపు ఇటలీలో ఇప్పటికే పదివేల మంది ఈ వైరస్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఇటలీలో ఇప్పటిదాకా 50 మంది డాక్టర్లు కూడా కరోనాతో చనిపోయినట్టు అక్కడి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ సర్జన్స్ అండ్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్ ఫిలిపో అనేలి ప్రకటించారు. అందులో 17 మంది డాక్టర్లు ఎక్కువ ఎఫెక్ట్ ఉన్న లొంబార్డి రీజియన్‌కు చెందిన వారేనని […]
ప్రపంచం మొత్తం కరోనావైరస్ కారణంగా అతలాకుతలం కాగా.. ఇటలీలో వైరస్ విజృంభించి విలయతాండవం చేసింది. దాదాపు ఇటలీలో ఇప్పటికే పదివేల మంది ఈ వైరస్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఇటలీలో ఇప్పటిదాకా 50 మంది డాక్టర్లు కూడా కరోనాతో చనిపోయినట్టు అక్కడి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ సర్జన్స్ అండ్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్ ఫిలిపో అనేలి ప్రకటించారు. అందులో 17 మంది డాక్టర్లు ఎక్కువ ఎఫెక్ట్ ఉన్న లొంబార్డి రీజియన్‌కు చెందిన వారేనని చెప్పారు. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య 30 వేలు దాటింది. ఇప్పటిదాకా ఈ వైరస్‌తో 33,523 మంది మరణించారు. 20 వేలకు పైగా మరణాలు ఒక్క యూరప్‌లోనే నమోదయ్యాయి. కేసులు ఏడు లక్షలు దాటాయి. 7,07,312 మందికి వైరస్ సోకింది. 1,50,732మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు.
Tags : 50 Doctors, Died, Corona virus, italy, yurap