జాబ్ రావాలంటే..సోషల్ మీడియాలో ఈ టిప్స్ ఫాలో అవ్వండి
కృషితో నాస్తి దుర్భిక్షం. లక్ష్మిని నమ్మి మోసపోయిన వాళ్లు ఉన్నారేమో కానీ చదువుల తల్లి సరస్వతిని నమ్మి ఎవరూ చెడ్డవారు కాలేదు. బిల్ గెట్స్, స్టీవ్ జాబ్స్, సత్య నాదెండ్ల ఫీవర్ తో కొందరు యువకులు ఊగిపోతుంటే… మరోపక్క గవర్నమెంట్ జాబే మా లక్ష్యం. కొడితే ఓ గ్రూఫ్ -1 ఆఫీసర్ పోస్ట్ కొట్టాల్సిందేనన్న ధ్యేయంతో ఉంది మరో యువలోకం. కానీ కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగాల సంగతేమో కానీ ప్రైవేట్ ఉద్యోగాలు సంపాదించడమే కష్టంగా మారింది. […]
కృషితో నాస్తి దుర్భిక్షం. లక్ష్మిని నమ్మి మోసపోయిన వాళ్లు ఉన్నారేమో కానీ చదువుల తల్లి సరస్వతిని నమ్మి ఎవరూ చెడ్డవారు కాలేదు. బిల్ గెట్స్, స్టీవ్ జాబ్స్, సత్య నాదెండ్ల ఫీవర్ తో కొందరు యువకులు ఊగిపోతుంటే… మరోపక్క గవర్నమెంట్ జాబే మా లక్ష్యం. కొడితే ఓ గ్రూఫ్ -1 ఆఫీసర్ పోస్ట్ కొట్టాల్సిందేనన్న ధ్యేయంతో ఉంది మరో యువలోకం. కానీ కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగాల సంగతేమో కానీ ప్రైవేట్ ఉద్యోగాలు సంపాదించడమే కష్టంగా మారింది. ఆర్ధిక మాంథ్యంతో పలు కంపెనీలు క్లోజ్ చేస్తుంటే మరికొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో తాము చదివిన చదువుకు తగ్గట్లు ఉద్యోగం సంపాదించేందుకు నిరుద్యోగులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జాబ్ కొట్టాలంటే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాను ఫాలో అయితే జాబ్ ఎలా దక్కించుకోవచ్చో సలహాలిస్తున్నారు.
1. సోషల్ మీడియాలో రెజ్యూమ్ లను షేర్ చేయాలి
సోషల్ మీడియాలో జాబ్ గురించి సెర్చ్ చేయడమే కాదు. ఎడ్యుకేషన్, ఎక్స్ పీరియన్స్, టెక్నికల్ నాలెడ్జ్ , ప్రీవియస్ మీరు ఏమైనా ప్రాజెక్ట్ లు చేసినా సంబంధిత వర్క్ గురించి ఆన్ లైన్ లో షేర్ చేయాలి. యూట్యూబర్ అయినా ఫర్వాలేదు. మీరు అప్‌లోడ్ చేసిన వీడియోల్ని షేర్ చేయోచ్చు. ఉదాహరణకు మీరు గ్రాఫిక్స్‌కు సంబంధించి యూట్యూబ్ ట్యూటోరియల్ రన్‌చేస్తుంటే ఆన్‌లైన్ లో ఫ్రీగా దొరికే వెబ్‌సైట్లతో మీ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోవాలి. అందులో మీ ట్యూటోరియల్ వీడియోల్ని పోస్ట్ చేయాలి.
2. లింక్డిన్, ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండాలి
సోషల్ మీడియాలో ప్రత్యేకించి లింక్డిన్, ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండాలి. జాబ్ గురించి సెర్చ్ చేసే సమయంలో లింక్డిన్, ట్విట్టర్ లో సంబంధిత ఉద్యోగాలకు గ్రూప్స్, యాష్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ యాష్ ట్యాగ్స్ తో సెర్చ్ చేస్తే మీ పని ఈజీ అవుతుంది.
3. ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవాలి
సోషల్ మీడియాలో షేర్ చేసే మీ జాబ్ ప్రొఫైల్ నిజాయితీగా ఉండాలి. జాబ్ కోసం ట్రై చేసే సమయంలో చాలా మంది ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంటారు. రిక్రూటర్లు మీ గురించి తెలుసుకునేందుకు మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నవారితో చాటింగ్ చేసి మీ గురించి తెలుసుకుంటారు. కాబట్టి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేయోద్దు. దీంతో పాటు ఫ్రెండ్స్‌తో కలిసి డ్రింక్ చేసిన సందర్భాలు ఉంటాయి. అలాంటి ఫోటోలు ఉంటే డిలీట్ చేయండి. ప్రైవసీ సెట్టింగ్స్ మార్చేయండి.
4. డిస్కషన్స్ లో పాల్గొనండి
సోషల్ మీడియాలో కొన్ని గ్రూఫ్స్ ఉంటాయి. మీ జాబ్ కు సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. వాటిలో మీరు పాటిస్పెంట్ చేయండి. జాబ్ గురించి, ప్రాజెక్ట్ గురించి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. అదృష్టం బాగుంటే డిస్కషన్స్ తోనే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది.
5. ప్రొఫెషనల్ గా ఉండాలి
మనం పైన చెప్పుకున్నట్లుగా సోషల్ మీడియాలో రెజ్యూమ్ షేర్ చేయడమే కాదు. ప్రొఫెషనల్ గా ఉండడం చాలా అవసరం. మీకు తెలిసిన కంపెనీలో జాబ్స్ ఉన్నాయని తెలిసిందనుకోండి. ఉద్యోగం కావాలని డైరెక్ట్‌గా మెసేజ్ చేయకూడదు. మీ పేరు రాహుల్ అయితే ఆ పేరుతో ఓ వెబ్ సైట్ ను క్రియేట్ చేసుకోండి. సదరు కంపెనీ ప్రతినిధులు మీ గురించి తెలుసుకోవాలని గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న వెబ్ సైట్ డిస్ ప్లే అవుతుంది. అప్పుడే వాళ్లకి మీరెంత ప్రొఫెషనల్ గా ఉంటారో తెలిసిపోతుంది. ఇలాంటి టిప్స్ పాటించి ఈజీగా జాబ్ సంపాదించండి.