కరోనా మందు ముందు వచ్చేది ఎక్కడికో తెలుసా?

న్యూఢిల్లీ: కరోనాతో విలవిల్లాడుతున్న రాష్ట్రాలకు కొవిడ్ 19 డ్రగ్ కొద్దిమేరకు ఉపశమనాన్ని ఇవ్వనుంది. కొవిడ్ 19 డ్రగ్ రెమ్‌డెసివర్ జనరిక్ వర్షన్ మందుల ఉత్పత్తి, మార్కెటింగ్‌కు అనుమతులు పొందిన హెటిరో ఫార్మా సంస్థ ఆ ఇంజెక్షన్ మందులను ముందుగా కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న రాష్ట్రాలకే సప్లై చేయనుంది. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ తొలి బ్యాచ్ రెమ్‌డెసివర్ మందులను ఐదు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు సహా హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే సుమారు 20వేల […]

Update: 2020-06-25 07:06 GMT

న్యూఢిల్లీ: కరోనాతో విలవిల్లాడుతున్న రాష్ట్రాలకు కొవిడ్ 19 డ్రగ్ కొద్దిమేరకు ఉపశమనాన్ని ఇవ్వనుంది. కొవిడ్ 19 డ్రగ్ రెమ్‌డెసివర్ జనరిక్ వర్షన్ మందుల ఉత్పత్తి, మార్కెటింగ్‌కు అనుమతులు పొందిన హెటిరో ఫార్మా సంస్థ ఆ ఇంజెక్షన్ మందులను ముందుగా కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న రాష్ట్రాలకే సప్లై చేయనుంది. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ తొలి బ్యాచ్ రెమ్‌డెసివర్ మందులను ఐదు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు సహా హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే సుమారు 20వేల ఇంజెక్షన్ బాటిల్స్‌ను మహారాష్ట్ర, ఢిల్లీలకు పంపింది. త్వరలోనే మిగతా రాష్ట్రాలకు ఈ మందులు చేరనున్నాయి. 100 మిల్లీ గ్రాముల ఇంజెక్షన్ బాటిల్‌కు 5,400లుగా హెటిరో సంస్థ ధరను నిర్ణయించింది. మూడు నాలుగు వారాల్లోనే కనీసం లక్షల బాటిళ్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఈ మందులు హైదరాబాద్‌లోని హెటిరో కంపెనీ ఫార్ములేషన్ పెసిలిటీలోనే ఉత్పత్తి అవుతున్నాయి. రెండో బ్యాచ్ మందులు కోల్‌కతా, ఇండోర్, భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చి, త్రివేండ్రం, గోవాలకు నౌకా మార్గం ద్వారా చేరనున్నాయి. ఈ మందు హాస్పిటళ్లు, ప్రభుత్వం ద్వారానే కరోనా పేషెంట్లకు చేరనుంది. రెటైల్ షాపుల్లో ఈ మందులు అందుబాటులో ఉండవని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ వంశీకృష్ణ బండి తెలిపారు. ఈ మందు ఉత్పత్తి మార్కెటింగ్‌కు అనుమతి పొందిన సిప్లా కూడా త్వరలోనే ఈ డ్రగ్‌ను మరింత తక్కువ ధరతో(రూ. ఐదువేల లోపు)అందుబాటులోకి తేనుందని సంస్థ తెలిపింది.

Tags:    

Similar News