ఆయన రూటే సపరేటు.. మహిళా అనుకూల తీర్పుల్లో మొనగాడు

దిశ, ఫీచర్స్ : మానవుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే చట్టాల ద్వారా దేశంలో న్యాయ ప్రక్రియ తరచుగా దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అణగారిన వ్యక్తుల స్వేచ్ఛను సమర్థించిన లేదా పోరాడిన వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఈ కోవకు చెందినవారే. మహిళా హక్కుల కోసం తన మద్దతును బలంగా వినిపించిన ఆయన.. చీఫ్ జస్టిస్ట్‌గా వెలువరించిన అనేక తీర్పులు, ప్రకటనలు సైతం ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. న్యాయవ్యవస్థలో […]

Update: 2021-10-02 04:11 GMT

దిశ, ఫీచర్స్ : మానవుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే చట్టాల ద్వారా దేశంలో న్యాయ ప్రక్రియ తరచుగా దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అణగారిన వ్యక్తుల స్వేచ్ఛను సమర్థించిన లేదా పోరాడిన వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఈ కోవకు చెందినవారే. మహిళా హక్కుల కోసం తన మద్దతును బలంగా వినిపించిన ఆయన.. చీఫ్ జస్టిస్ట్‌గా వెలువరించిన అనేక తీర్పులు, ప్రకటనలు సైతం ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

న్యాయవ్యవస్థలో మహిళలకు 50% ప్రాతినిధ్యానికి మద్దతు..

సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా.. ‘న్యాయవ్యవస్థలో మహిళలకు 50% ప్రాతినిధ్యం అవసరం. ఇది వేల సంవత్సరాల అణచివేతకు సంబంధించిన సమస్య. దిగువ స్థాయిల్లో 30% కంటే తక్కువ మంది మహిళా అడ్వకేట్స్ ఉన్నారు. హైకోర్టులో ఇది 11.5 శాతం కాగా, సుప్రీంకోర్టులో 11-12 శాతం మాత్రమే. అందుకే మహిళలు జ్యుడిషియరీలో 50% రిజర్వేషన్‌ను దాతృత్వంగా కాకుండా తమ హక్కుగా డిమాండ్ చేయాలి’ అన్నారు.

బలహీన వర్గాలకు సమాన న్యాయం కోరుతూ ర్యాలీ..

సమాజంలోని పేదలు, నిరక్షరాస్యులు, బలహీన వర్గాలు తమ హక్కులను వినియోగించుకోలేకపోతే ‘అందరికీ సమాన న్యాయం’ అనే హామీ అర్థరహితమని జస్టిస్ రమణ పేర్కొన్నారు. న్యాయవాదుల ఫీజుపై పరిమితి విధించాలని ఆయన ప్లాన్ చేసినపుడు.. ఒక వృద్ధ మహిళ తనను కలిసి ఇకపై పేదలు మెరుగైన లీగల్ అడ్వైస్ పొందగలుగుతారని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ‘ప్రజలు మనల్ని చేరుకోలేనప్పుడు, మనం వారిని చేరుకోవాలి’ అని ఈ ఉదంతం తనకు తెలియజేసిందని ఆయన అన్నారు.

ఒక గృహిణి విలువ.. ఆఫీసుకు వెళ్లే భర్తతో సమానం..

ఎన్‌వీ రమణ, సూర్య కాంత్‌తో కూడిన ధర్మాసనం ఢిల్లీలో ఒక స్కూటర్‌ను కారు ఢీకొనడంతో మరణించిన దంపతుల బంధువులకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ ఈ పరిశీలన చేసింది. ఇంట్లో పనులకే అంకితమై, తమ పూర్తి సమయాన్ని వెచ్చించే మహిళల శ్రమ.. పురుషులు ఆఫీసులకు వెళ్లి చేసే పనితో సమానమని పరిగణించారు.

ఉమెన్ ఆఫీసర్స్‌కు పర్మినెంట్ కమిషన్ కోసం..

సాయుధ దళాల్లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేయకపోవడంపై ఎన్‌వీ రమణ ప్రభుత్వాన్ని నిలదీశాడు. ఈ విషయంలో ప్రభుత్వం ‘వివక్ష ధోరణి’ని అవలంబించకూడదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే 2020లో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్ మంజూరు చేయబడింది.

మహిళా హక్కులు, రక్షణపై అవేర్‌నెస్ క్యాంపెయిన్..

‘అవగాహన లేమి అనేది దేశంలోని మరింత ప్రగతిశీల విధానాలను ఉపయోగించకుండా మహిళలను నిరోధిస్తుందన్న ఎన్‌వీ రమణ.. 74 వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆ దిశగా ప్రచారాన్ని ప్రారంభించాడు. ఇది జాతీయ మహిళా కమిషన్ (NCW), నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA)తో కలిసి చేసిన ప్రయత్నం.

Tags:    

Similar News