కరోనాతో ఒక్కరోజే ఐదుగురు మృతి..

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులతో పాటు, తాజాగా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా సోకి గురువారం ఐదుగురు మృతి చెందారు. ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్, మానకొండూరుకు చెందిన మహిళ మృతి చెందారు. అలాగే చందుర్తి మండలం బండపల్లికి చెందిన మహిళ, వీణవంకకు చెందిన వృద్ధుడు, ధర్మారం మండలం నంది మేడారానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కరోనాతో మరణించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కాగా, […]

Update: 2020-09-11 02:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులతో పాటు, తాజాగా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా సోకి గురువారం ఐదుగురు మృతి చెందారు. ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్, మానకొండూరుకు చెందిన మహిళ మృతి చెందారు.

అలాగే చందుర్తి మండలం బండపల్లికి చెందిన మహిళ, వీణవంకకు చెందిన వృద్ధుడు, ధర్మారం మండలం నంది మేడారానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కరోనాతో మరణించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కాగా, కరోనా పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.

Read Also..

కరోనా ఇప్పట్లో పోదు : ఈటల

Full View

 

Tags:    

Similar News