కరోనాతో మృతిచెందిన జర్నలిస్టులకు 5లక్షలు..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాటుకు బలవుతున్న కలం యోధులకు అండగా ఉంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. జర్నలిస్టుల కరోనా వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పాత్రికేయుల వైద్య సేవల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నోడల్ అధికారిగా జేడీ కిరణ్‌కుమార్‌ను నియమించింది. ప్రతి జిల్లాలోనూ సమాచార శాఖ డీడీలు నోడల్ అధికారులుగా నియామకం చేపట్టింది. ఆసుపత్రుల్లో బెడ్ల కేటాయింపు, ఆడ్మిషన్లు నోడల్ అధికారులే చేయించనున్నారు. కరోనాతో మృతిచెందిన జర్నలిస్టులకు సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాటుకు బలవుతున్న కలం యోధులకు అండగా ఉంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. జర్నలిస్టుల కరోనా వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పాత్రికేయుల వైద్య సేవల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నోడల్ అధికారిగా జేడీ కిరణ్‌కుమార్‌ను నియమించింది. ప్రతి జిల్లాలోనూ సమాచార శాఖ డీడీలు నోడల్ అధికారులుగా నియామకం చేపట్టింది. ఆసుపత్రుల్లో బెడ్ల కేటాయింపు, ఆడ్మిషన్లు నోడల్ అధికారులే చేయించనున్నారు. కరోనాతో మృతిచెందిన జర్నలిస్టులకు సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు ప్రకటించారు.