లాక్‌డౌన్‌లో 5.5 లక్షల బిర్యానీ ఆర్డర్స్
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కారణంగా మార్చి 25 నుంచి లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఫుడ్ డెలివరీ సర్వీస్‌లు కొన్ని రోజుల వరకు తమ సేవలు కొనసాగించాయి. ఆ తర్వాత వాటిపై ఆంక్షలు విధించినా.. మళ్లీ సడలింపుల్లో భాగంగా కొవిడ్ జాగ్రత్తలతో సేవలు కొనసాగించాల్సిందిగా సర్కారు ఆదేశాలు ఇచ్చింది. లాక్‌డౌన్ వేళ..భోజన ప్రియులు 5.5 లక్షల బిర్యానీలు ఆర్డర్ చేశారని స్విగ్గీ సర్వేలో తేలింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కారణంగా మార్చి 25 నుంచి లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఫుడ్ డెలివరీ సర్వీస్‌లు కొన్ని రోజుల వరకు తమ సేవలు కొనసాగించాయి. ఆ తర్వాత వాటిపై ఆంక్షలు విధించినా.. మళ్లీ సడలింపుల్లో భాగంగా కొవిడ్ జాగ్రత్తలతో సేవలు కొనసాగించాల్సిందిగా సర్కారు ఆదేశాలు ఇచ్చింది. లాక్‌డౌన్ వేళ..భోజన ప్రియులు 5.5 లక్షల బిర్యానీలు ఆర్డర్ చేశారని స్విగ్గీ సర్వేలో తేలింది.
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ చేసిన సర్వేకు ‘స్టాటిస్టిక్స్ : ద క్వారంటైన్ ఎడ్యుకేషన్’ (statEATstics)గా పేరు పెట్టింది. లాక్‌డౌన్ వేళ.. బిర్యానీ తర్వాత బటర్ నాన్ , మసాల దోశలు కూడా ఎక్కువగానే ఆర్డర్లు దక్కించుకున్నట్లు తేలింది. అయితే బిర్యానీ తింటే సరిపోతుంది. అది తిన్నాక ఓ స్వీట్ లేదా కేక్ తినడం ఫుడ్డీస్‌కు ఎంతో ఇష్టం. సో లాక్‌డౌన్ టైమ్‌లో 1,29,000 కేకులు ఆర్డర్ చేశారు. ఆ తర్వాత గులాబ్ జామున్, బటర్ స్కాచ్ మౌసీ కేక్‌లు అత్యధికంగా ఆర్డర్లు దక్కించుకున్నట్లు తెలిసింది. మరో విషయం ఏంటంటే..రోజూ రాత్రి 8 గంటల సమయంలో మీల్స్ ఆర్డర్ వచ్చేవని తెలిపింది. దాదాపు 65వేల మీల్స్ ఆర్డర్లు వచ్చినట్లు తేలింది.
లాక్‌డౌన్ టైమ్‌లో స్విగ్గీ గ్రాసరీలు కూడా డెలివరీ చేసిన విషయం తెలిసిందే. 323 మిలియన్ కేజీల ఉల్లిగడ్డలు, 56 మిలియన్ కేజీల అరటి పండ్లు, 3, లక్షల 50వేల నూడుల్స్ ఆర్డర్ చేసినట్లు సర్వేలో తేలింది. 73వేల హ్యాండ్ వాష్, శానిటైజర్లు, 47వేల ఫేస్ మాస్క్‌లు కూడా ఆర్డర్ చేశారు.