ఇరాన్ లో కరోనాతో ఒకే రోజు 49 మృతి..

ఇరాన్ దేశంలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఒక్కరోజే 49 మంది మ‌ృతి చెందారు. కోవిడ్ -19 కారణంగా దేశంలో గత 24 గంటల్లో 49 మంది మరణించారని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రతినిధి యానుష్ జహాన్ పూర్ ఆదివారం ప్రకటించారు. ఇరాన్ లో ఇప్పటి వరకు 194 మంది ప్రాణాలు కోల్పోయారు. 6566 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇరాన్ లోని 31 ప్రావిన్సులకు కరోనా వైరస్ వ్యాపించింది. […]

Update: 2020-03-08 08:44 GMT

ఇరాన్ దేశంలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఒక్కరోజే 49 మంది మ‌ృతి చెందారు. కోవిడ్ -19 కారణంగా దేశంలో గత 24 గంటల్లో 49 మంది మరణించారని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రతినిధి యానుష్ జహాన్ పూర్ ఆదివారం ప్రకటించారు. ఇరాన్ లో ఇప్పటి వరకు 194 మంది ప్రాణాలు కోల్పోయారు. 6566 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇరాన్ లోని 31 ప్రావిన్సులకు కరోనా వైరస్ వ్యాపించింది. కరోనా వైరస్ ప్రభావం చైనా, ఇటలీ, తర్వాత ఇరాన్ లోనే అధికంగా ఉంది. ఫిబ్రవరి 19న మొదటి కరోనా కేసు నమోదవ్వగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మరణ మృదంగం వాయిస్తోంది.

tags;corona virus, iran, one day 49 has been dead, overall 194 dead

Tags:    

Similar News