ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 47 పాజిటివ్ కేసులు

దిశ, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజాగా గడిచిన 24 గంటల్లో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో కామారెడ్డి జిల్లాలో 33 పాజిటివ్ కేసులు రాగా, నిజామాబాద్ జిల్లాలో 14 కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు నిర్ధారించారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకూ మొత్తం 224 పాజిటివ్ కేసులు ఉండగా, అందులో 170 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వైరస్ మూలంగా నలుగురు చనిపోయారని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడలోనూ అత్యధిక […]

Update: 2020-07-16 09:05 GMT

దిశ, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజాగా గడిచిన 24 గంటల్లో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో కామారెడ్డి జిల్లాలో 33 పాజిటివ్ కేసులు రాగా, నిజామాబాద్ జిల్లాలో 14 కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు నిర్ధారించారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకూ మొత్తం 224 పాజిటివ్ కేసులు ఉండగా, అందులో 170 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వైరస్ మూలంగా నలుగురు చనిపోయారని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడలోనూ అత్యధిక కేసులు వెలుగు చూస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 295 పాజిటివ్ కేసులు అయ్యాయి. గురువారం జిల్లాలో 14 కేసులు కాగా ఇద్దరు కరోనాతో చనిపోయారు. జిల్లాలో వైరస్‌తో పోరాడుతూ 16 మంది మృతిచెందారు. అందులో ఒక హోంగార్డు ఉండటంతో కరోనా వారియర్స్‌లో వైరస్ గుబులు రేపుతుంది. నిజామాబాద్ జిల్లాలో గురువారం నుంచి ర్యాపిడ్ యాంటి జెన్ డిటెన్షన్ టెస్టులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో షురు చేస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు.

Tags:    

Similar News