జీహెచ్ఎంసీలో కొత్తగా 45?

దిశ, న్యూస్ బ్యూరో: బస్తీ దవాఖానల ద్వారా నాణ్యమైన ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎర్రగడ్డలోని సుల్తాన్ నగర్ బస్తీలో, వెంగల్ రావు నగర్‌లోని యాదగిరి నగర్‌లో బస్తీ దవాఖానాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. బస్తీ దవాఖానా ప్రారంభించిన అనంతరం అక్కడ వైద్యం కోసం వచ్చిన వృద్ధురాలి యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా తాను ప్రయివేట్ ఆసుపత్రుల్లో తనకున్న ఇబ్బందులకు వైద్యం […]

Update: 2020-05-22 10:25 GMT

దిశ, న్యూస్ బ్యూరో: బస్తీ దవాఖానల ద్వారా నాణ్యమైన ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎర్రగడ్డలోని సుల్తాన్ నగర్ బస్తీలో, వెంగల్ రావు నగర్‌లోని యాదగిరి నగర్‌లో బస్తీ దవాఖానాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. బస్తీ దవాఖానా ప్రారంభించిన అనంతరం అక్కడ వైద్యం కోసం వచ్చిన వృద్ధురాలి యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా తాను ప్రయివేట్ ఆసుపత్రుల్లో తనకున్న ఇబ్బందులకు వైద్యం చేయించుకుటున్నట్లు ఆమె కేటీఆర్‌కు తెలిపింది. బస్తీలోనే మంచి వైద్యం అందుబాటులోకి రావడంతో ఇక నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాకుండా ఇక్కడే వైద్యం చేయించుకోవాలని వృద్ధురాలికి మంత్రి సూచించారు. బస్తీ దవాఖానాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో వీటిని మరింతగా విస్తరించే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.

పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం కోసం బస్తీ దవాఖానాలకు శ్రీకారం చుట్టామని, ప్రైవేటు వైద్యంపై ఆధారపడకుండా చూస్తామని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను ఆయన కూడా ప్రారంభించారు. ఉప్పల్‌లో మూడు, బంజారాహిల్స్‌లో రెండు సెంటర్లను ఆరోగ్య శాఖ మంత్రి స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంచుతున్నామన్నారు. బస్తీ దవాఖానాల్లో స్క్రీనింగ్ తో పాటు మందులు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ పరీక్షలు చేయడానికి అవకాశం లేకపోయినా శాంపిల్స్ తీసి ఐపీఎంకి పంపి టెస్ట్‌లు చేయిస్తామని చెప్పారు. అలాగే, కుషాయిగూడలోని పరిమళనగర్, మల్లాపూర్ డివిజన్ అశోక్ నగర్లో బస్తీ దవాఖానాలను నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్ర‌తివార్డుకు మూడు బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు చేయాల‌నే ఆలోచన ఉన్న‌ట్లు మేయర్ తెలిపారు. మొత్తంగా శుక్రవారం ఒక్కరోజే జీహెచ్ఎంసీ పరిధిలో 45 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం విశేషం.

Tags:    

Similar News