ఏపీలో మరో 439 కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 439 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 24,451 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,059కి చేరింది. తాజాగా కరోనాతో ఐదుగురు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 106కు చేరింది. కరోనాతో కోలుకుని 24 గంటల్లో 151 మంది డిశ్చార్జి అయ్యారు. ఏపీలో గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 70, కృష్ణా జిల్లాలో 66, కడపలో […]

Update: 2020-06-21 02:50 GMT

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 439 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 24,451 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,059కి చేరింది. తాజాగా కరోనాతో ఐదుగురు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 106కు చేరింది. కరోనాతో కోలుకుని 24 గంటల్లో 151 మంది డిశ్చార్జి అయ్యారు. ఏపీలో గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 70, కృష్ణా జిల్లాలో 66, కడపలో 58, పశ్చిమగోదావరిలో 52, చిత్తూరు, కర్నూలుల్లో 47, వైజాగ్‌లో 39, గుంటూరులో 26, నెల్లూరులో 12, అనంతపురంలో 11, విజయనగరంలో 6, ప్రకాశం జిల్లాలో 5 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 3,599 మంది చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News