ఏపీలో కరోనా విలయతాండవం.. ఒకేరోజు 43 మంది మృతి

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో 1916 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన 8 మందికి సోకగా, ఏపీకి చెందిన వారికి 1908 మందికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి ఏపీలో ఇప్పటివరకూ మొత్తం 33,019 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. మరోవైపు, కరోనా కారణంగా […]

Update: 2020-07-14 03:42 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో 1916 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన 8 మందికి సోకగా, ఏపీకి చెందిన వారికి 1908 మందికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి ఏపీలో ఇప్పటివరకూ మొత్తం 33,019 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రకటించింది.

మరోవైపు, కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో 43 మంది మృతి చెందారని వెల్లడించింది. అత్యధికంగా అనంతపూర్‌ జిల్లాలో 10 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 9, చిత్తూరు, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో 5 మంది చొప్పున, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు కరోనాతో మృతిచెందారు. దీంతో ఏపీలో ఇప్పటివరకూ కొవిడ్-19 కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 408కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చేరి కరొనాకి చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,467కి చేరింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో కరోనాకి 15,144 మంది చికిత్స పొందుతున్నారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Tags:    

Similar News