ఆ రాష్ట్రంలో కొత్తగా 43కేసులు
దిశ, వెబ్ డెస్క్ :దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి విజృంభిస్తోంది. రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారి వ్యాప్తి చెందకుండా మిజోరం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా 17 మంది బీఎస్ఎఫ్ సిబ్బందితో పాటు, కొత్తగా 43 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఇప్పటి వరకు 608 పాజిటివ్ కేసులు […]
దిశ, వెబ్ డెస్క్ :దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి విజృంభిస్తోంది. రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారి వ్యాప్తి చెందకుండా మిజోరం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా 17 మంది బీఎస్ఎఫ్ సిబ్బందితో పాటు, కొత్తగా 43 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఇప్పటి వరకు 608 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఐజ్వాల్ జిల్లాలో కొత్తగా 24 కేసులు, కోలాసిబ్‌లో 18 కేసులు నమోదయ్యాయి. దీంతో స్థానికంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.