ఏపీ కరోనా @ 427

ఏపీలో కరోనా వైరస్ ఉధృతి అధికంగా ఉంది. శనివారం నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కొత్తగా 22 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 427కి పెరిగింది. తాజాగా గుంటూరులో 14, నెల్లూరులో 4, కర్నూలు 2, చిత్తూరు, కడప జిల్లాల్లో ఒక్కటి చొప్పున కొత్త కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులోని దాచేపల్లికి చెందిన ఓ బాధితుడు మ‌ృతి చెందటంతో, మ‌ృతుల సంఖ్య 7 కు చేరింది. తాజాగా ఓ బాధితుడు […]

Update: 2020-04-12 20:14 GMT

ఏపీలో కరోనా వైరస్ ఉధృతి అధికంగా ఉంది. శనివారం నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కొత్తగా 22 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 427కి పెరిగింది. తాజాగా గుంటూరులో 14, నెల్లూరులో 4, కర్నూలు 2, చిత్తూరు, కడప జిల్లాల్లో ఒక్కటి చొప్పున కొత్త కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులోని దాచేపల్లికి చెందిన ఓ బాధితుడు మ‌ృతి చెందటంతో, మ‌ృతుల సంఖ్య 7 కు చేరింది. తాజాగా ఓ బాధితుడు విజయవాడ జీజీహెచ్ నుంచి డిశ్చార్జి అయ్యాడు. దీంతో ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 12కు చేరింది.

జిల్లాల వారిగా కేసుల వివరాలు

గుంటూరు 89, కర్నూలు 84, నెల్లూరు 52, ప్రకాశం 41, కృష్ణా 35, కడప 31, పశ్చిమగోదావరి 22, చిత్తూరు 21, విశాఖపట్నం 20, తూర్పు గోదావరి 17, అనంతపురం 15. కాగా, శ్రీకాకుళం, విజయనగరంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Tags: carona, positive cases, 427, ap, guntur

Tags:    

Similar News