భారత్ కరోనా @ 67,152

దేశంలో కరోనా రక్కసి కోరలు చాచుతోంది. గత వారం రోజుల నుంచి కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,213 మందికి వైరస్ సోకింది. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటి‌సారి. ఆదివారం దేశంలో 93 కరోనా మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 2,206 కు చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులు కలుపుకుంటే దేశవ్యాప్తంగా మొత్తం […]

Update: 2020-05-10 23:21 GMT

దేశంలో కరోనా రక్కసి కోరలు చాచుతోంది. గత వారం రోజుల నుంచి కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,213 మందికి వైరస్ సోకింది. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటి‌సారి. ఆదివారం దేశంలో 93 కరోనా మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 2,206 కు చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులు కలుపుకుంటే దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 67,152కు చేరింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి 20,917 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 44,029గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గత ఆదివారంతో పోల్చుకుంటే ఈ వారం బాధితుల రికవరీ శాతం 31.14 శాతంగా నమోదైంది.

Tags:    

Similar News